Begin typing your search above and press return to search.
ప్రజలకు ఆప్షన్ ఇవ్వటమే పవన్ కొంప ముంచిందా?
By: Tupaki Desk | 24 May 2019 5:25 AM GMTప్రజలకు అప్షన్ ఉంటే ఎలాంటి తీర్పు ఇస్తారన్న విషయం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎపిసోడ్ లో స్పష్టమైందని చెప్పాలి. సేఫ్ గేమ్ ఆడితే మొదటికే మోసం వస్తుందన్న విషయం తాజా ఓటమితో పవన్ కు అర్థమై ఉండాలి. ఏపీ రాజకీయాల్లో కీలకభూమిక పోషిస్తారంటూ హైప్ క్రియేట్ అయిన పవన్ కు.. దిమ్మ తిరిగేలా ఏపీ ప్రజలు షాకిచ్చారని చెప్పాలి. భారీ ఇమేజ్ ఉన్న పవన్.. రెండు చోట్ల అలా ఎలా ఓడారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
పవన్ ఓటమిపై ఆయన నామినేషన్ వేసిన నాటి నుంచే ఒక క్లారిటీ ఉన్నప్పటికీ.. ఇంత దారుణమైన ఫలితం వస్తుందని ఎవరూ ఊహించలేదని చెబుతారు. రెండు చోట్ల నుంచి పోటీ చేయటమే పవన్ కొంప ముంచిందా? అంటే అవుననే మాట బలంగా వినిపిస్తోంది.
భీమవరం నుంచే కాదు గాజువాక నుంచి పోటీ చేయాలన్న నిర్ణయమే ఆయన ఓటమికి కారణంగా భావిస్తున్నారు. పవన్ లాంటోడు ఎక్కడైనా గెలుస్తారన్న అతి విశ్వాసం తాజా ఓటమికి ఒక కారణమైతే.. రెండు చోట్ల పోటీ చేసిన నేపథ్యంలో.. ఎక్కడో ఒకచోట గెలుస్తారు కదా..? రెండు చోట్ల గెలిచాక ఏదో ఒక స్థానాన్ని వదులుకుంటారు కదా? అలా వదులుకునే స్థానం తమదే అయి ఉంటుందన్న ఆలోచనే పవన్ రెండు చోట్ల ఓడిపోవటానికి కారణంగా చెబుతున్నారు.
గెలిచిన తర్వాత వదులుకునే నియోజకవర్గం తమదే అయి ఉంటుందన్న ఆలోచనతో పాటు.. స్థానికంగా పవన్ ప్రత్యర్థి మీద ఉన్న సానుకూలత కూడా పవన్ కు దెబ్బేసినట్లుగా చెప్పాలి. "పవన్ ను ఓడించాలన్న ఉద్దేశం మాకు లేదు. కాకుంటే.. గాజువాకలో ఆయన గెలుస్తారు. భీమవరం సొంత ప్రాంతం కాబట్టి.. మనోళ్లు ఏమీ అనుకోరన్న ఉద్దేశంతో భీమవరం సీటుకు పవన్ రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే.. స్థానికంగా ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న గ్రంధి శ్రీనివాస్ కు మరో అవకాశం ఇవ్వాలని భావించారు. పవన్ ను ఓడించాలన్న దాని కంటే.. గ్రంధికి మరో అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో పాటు.. గాజువాకలో గెలుపు పక్కా కదా అన్న ఉద్దేశమే పవన్ ఓటమికి కారణమైంది. కానీ.. ఆయన అక్కడ కూడా ఓడిపోతారన్న ఆలోచన ఉంటే.. భీమవరం ఓటర్ల ఆలోచన మరోలా ఉండేది" అంటూ పలువురు ఓటర్లు చెబుతున్న మాటలు చూస్తే.. పవన్ సేఫ్ గేమ్ ఆయన్ను ఓడించిందని చెప్పక తప్పదు.
గాజువాకలోనూ ఇలాంటి పరిస్థితే పవన్ కు ఎదురైందని చెబుతున్నారు. రెండు చోట్ల గెలిచే పవన్.. తమ స్థానానికి రాజీనామా చేసే అవకాశం ఉంది కదా? అలాంటప్పుడు స్థానికంగా ఉన్న నేతకు అవకాశం ఇస్తే బాగుంటుందన్న ప్రజల ఆలోచన పవన్ కొంప ముంచిందని చెప్పాలి. తాను పోటీ చేసేది అనంతపురం జిల్లా నుంచి అంటూ మొదట్నించి చెప్పిన పవన్.. చివర్లో పోటీ చేయకుండా హ్యాండ్ ఇచ్చినట్లే.. పవన్ కు భీమవరం.. గాజువాక ప్రజలు పవన్ కు ఓట్లు వేయకుండా హ్యాండ్ ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభిమానులకు హ్యాండివ్వటం సెలబ్రిటీలకు అలవాటే. కానీ.. సెలబ్రిటీలకు సైతం అభిమానులు హ్యాండ్ ఇస్తారన్న కొత్త సందేశం పవన్ ఎపిసోడ్ లో స్పష్టమైందని చెప్పాలి.