Begin typing your search above and press return to search.
సుప్త చేతనావస్థ నుంచి బయటకొచ్చిన పవన్!
By: Tupaki Desk | 22 Sep 2018 12:09 PM GMTజనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ తన `జన పోరాట యాత్ర`ను ఉత్తారాంధ్రలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. రకరకాల కారణాలతో....పలు విరామాలతో ఉత్తరాంధ్ర పర్యటనను ముగించిన పవన్....ఆ తర్వాత పశ్చిమ గోదావరి యాత్రను ప్రారంభించారు. అయితే, ఏలూరులో పర్యటిస్తున్న పవన్....వ్యక్తిగత కారణాలతో పర్యటనకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ తన యాత్రను ఈ నెల 25 నుంచి ఏలూరులో రీస్టార్ట్ చేయబోతున్నారని జనసేన వర్గాలు ప్రకటించాయి. నేడు నెల్లూరు జిల్లాలో జరుగుతోన్న రొట్టెల పండుగలో పాల్గొన్న తర్వాత పవన్......రేపటి నుంచి తన యాత్రను కొనసాగించనున్నారు. ఆదివారం నాడు ఏలూరులో తన యాత్రను పవన్ పునఃప్రారంభించేందుకు సిద్ధమయ్యారని జనసేన ఓ ప్రకటనలో తెలిపింది.
వాస్తవానికి పవన్ జన పోరాట యాత్రలో బ్రేకులు ఎక్కువగా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. దాదాపుగా యాత్ర ఎన్నిరోజులు సాగిందో....అన్ని రోజులు పవన్ బ్రేక్ తీసుకున్నారని టాక్ ఉంది. ఇపుడు కూడా పవన్ దాదాపు నెల రోజుల విరామం అనంతరం యాత్రను ప్రారంభించబోతున్నారు. ఈ సారి యాత్రలో భాగంగా పవన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. గతంలో సందర్శించకుండా మిగిలిపోయిన 7 మండలాల్లో ఆయన పర్యటన సాగనుందని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. తూర్పు గోదావరిలోకి ప్రవేశించే మందు ఈ యాత్ర నిరాటంకంగా సాగనుందట. అయితే, పవన్ యాత్రలపై ప్రజలు, రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఆగస్టు చివరి వారంలో వరదలు వచ్చిన సమయంలో పవన్ అక్కడ కనిపించలేదు. అయితే, భద్రతా కారణాలు, కంటి ఇన్ఫెక్షన్ వంటి కారణాలతో పవన్ తన యాత్రను వాయిదా వేసుకున్నారు. అయితే, పవన్ ...ఈ నెల రోజుల్లో పవన్ పూర్తిగా విరామం తీసుకున్నదీ లేదు. హోటల్ కాకతీయలో నిర్వహించిన సమావేశంలో...పవన్ పాల్గొన్నారు. సోషల్ మీడియాలోకూడా యాక్టివ్ గా ఉన్నారు. మరి, ఈ సారైనా పవన్ యాత్ర బ్రేకులు లేకుండా తూర్పు గోదావరిలోకి ఎంటరవుతుందో లేదో వేచి చూడాలి. మొత్తానికి సుప్త చేతనావస్థ నుంచి పవన్ బయటకొచ్చినట్లేనని టాక్ వస్తోంది.
వాస్తవానికి పవన్ ...ఆదివారం నుంచి తన పర్యటనను ఏలూరు నుంచి రీస్టార్ట్ చేయాల్సి ఉంది. అయితే, ఆ టూర్ కు ముందు రోజు సడెన్ గా నెల్లూరులో పవన్ ప్రత్యక్షమవడానికి కారణముందట. స్వామికార్యం...స్వకార్యం రెండూ పూర్తి చేసేందుకు పవన్ నెల్లూరు టూర్ ప్లాన్ చేశారట.
నెల్లూరుకు చెందిన మైనార్టీనేత, మాజీ మేయర్ అజీజ్ ఆహ్వానం ప్రకారం పవన్ అక్కడకు వచ్చారట. నెల్లూరు టౌన్ సీటును 2008లో ప్రజారాజ్యం తరఫున ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి గెలుచుకున్నారు. దాంతోపాటు టీడీపీ నుంచి సిటీ టికెట్ ఆశించి ఖంగుతిన్న అజీజ్ ..జనసేనలో చేరేందుకు రెడీగా ఉన్నారట. దీంతో, నెల్లూరులోని పరిస్థితులను అంచనా వేయడంతోపాటు...రొట్టెల పండగలోపాల్గొని తన కోరిక నెరవేర్చుకునేందుకు జనసేనాని నెల్లూరుకు వస్తున్నారట. దీంతోపాటు నెల్లూరుజిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కూడా పవన్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనర్ గా ఉన్న మాదాసు గంగాధరం - టీటీడీ మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి జనసేన, ఆయన భార్య సుచరిత ..ఇలా నెల్లూరు వాసులు జనసేనలో ఉండడంతో ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.