Begin typing your search above and press return to search.
టీజీ ఎటకారం ఆడినా పవన్ అందుకే తిట్టడట!
By: Tupaki Desk | 25 Feb 2019 4:48 AM GMTమీరో ప్రముఖుడు. మిమ్మల్ని మరో ప్రముఖుడు ఇంటి భోజనానికి పిలిచారు. వెళ్లారు. చక్కగా మర్యాదలు చేశారు. మీ వ్యాపారానికో.. మీ వృత్తికో ప్రయోజనం కలిగేలా ఆయన వ్యవహరించారు. అందుకు మీరేం చేస్తారు? సదరు వ్యక్తికి విధేయుడిగా వ్యవహరిస్తారు. అతడికేదైనా అవసరం వస్తే.. పరిగెత్తుకుంటూ వెళ్లి సాయం చేస్తారు. అతని కష్టానికి అండగా ఉంటారు. మరి.. అతిధ్యం ఇచ్చిన వ్యక్తి.. మీ మంచితనాన్ని ఎటకారం చేస్తూ.. మీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తే ఏం చేస్తారు? అరే.. మనల్ని పిలిచి భోజనం పెట్టాడు కదా? చక్కటి అతిధ్యం ఇచ్చాడు కదా.. అంటూ ఊరుకుంటారా? ఒక రోజు అతిధ్యానికి ఎంత ఎటకారం చేసినా పడి ఉంటారా? అంటే.. నో అంటే నో చెబుతారు.
ఎంత అతిధ్యం ఇస్తే మాత్రం ఇమేజ్ డ్యామేజ్ చేసి.. కోట్లాది మంది ముందు ఎటకారం చేస్తే ఊరుకుంటారా? మాటకు మాట చెప్పటమే కాదు.. గట్టిగా రిటార్ట్ ఇచ్చేందుకు వెనుకాడరు కదా. కానీ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం భిన్నం. తనకు అతిధ్యం ఇచ్చిన వ్యక్తికి.. తనకు కాసింత లబ్థి చేకూర్చరన్న ఒక్క కారణంతో టీజీ వెంకటేశ్ లాంటి వ్యక్తిని ఏమనుకుండా ఉన్నారన్న కొత్త విషయం పవన్ నోటి నుంచే వచ్చింది.
టీజీ వెంకటేశ్ తనను ఎన్నిసార్లు తిట్టినా.. ఎగతాళి చేసినా.. తాను కోపం తెచ్చుకోకుండా నిగ్రహంతో ఉండటానికి కారణం ఉందని పవన్ వెల్లడించారు. తన మొదటి మూడు సినిమాలు టీజీ వెంకటేశ్ థియేటర్లలో వంద రోజులు ఆడాయని.. ఒక రోజు అతిధ్యం ఇచ్చారన్న కృతజ్ఞత ఉన్నట్లు పవన్ పేర్కొన్నారు. ఈ కారణంతోనే తాను ఆయన్ని ఏమనలేదన్నారు.
తాను రాజ్యసభ సీటుకు అడ్డు పడనందుకే టీజీకి ఎంపీగా అవకాశం వచ్చిందన్నారు. టీజీ వెంకటేశ్ పరిశ్రమల కారణంగా తుంగభద్ర నదిలోకాలుష్యం పెరగటానికి కారణం అవుతుందని చెప్పిన ఆయన.. టీజీని ఒప్పించి కాలుష్యాన్ని ఆపనున్నట్లు చెప్పారు. ఒక రోజు అతిధ్యానికే ఎన్ని మాటలు అన్నా ఊరుకున్న పవన్ లాంటి నేత.. టీజీ లాంటి ఫక్తు రాజకీయ వ్యాపారిని ఒప్పించి ఆయనకు కోట్లు తెచ్చి పెట్టే పరిశ్రమల నుంచి కాలుష్యాన్ని ఆపటం సాధ్యమా? అయినా.. పవన్ మూడు సినిమాలు వంద రోజులు థియేటర్లలో ఆడటం మంటే.. డిమాండ్ ఉంటే ఆడతాయి కానీ.. లాభం లేకుండా టీజీ సినిమాల్ని ఆడించరు కదా? అర్థం లేని లాజిక్కులతో విధేయత ప్రదర్శించే బలహీన గుణం పవన్ లో ఉందన్న కొత్త విషయం బయటకు వచ్చింది. రానున్న రోజుల్లో ఇలాంటి బలహీనతలు మరెన్ని పవన్లో ఉన్నాయో..?