Begin typing your search above and press return to search.
పయ్యావుల మౌనం వెనుక మర్మం ఏమిటి?
By: Tupaki Desk | 29 Aug 2020 6:13 PM GMTపయ్యావుల కేశవ్....ఏపీ రాజకీయాలపై కొద్దో గొప్పో అవగాహన ఉన్నవారికి ఈ పేరు సుపరిచితమే. టీడీపీలో సీనియర్ నేతగా, మంచి వాగ్దాటి ఉన్న నాయకుడిగా టీడీపీ వర్గాల్లో పయ్యావులకు మంచి పేరుంది. అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 4 సార్లు గెలిచిన పయ్యావుల....టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత ప్రీతిపాత్రమైన నేతల్లో ఒకరు. పయ్యావుల ప్రసంగాల కోసం టీడీపీ కేడర్ ఎదురు చూస్తూ ఉంటుందని చంద్రబాబు స్వయంగా ప్రశంసించారంటే ఆయన వాగ్ధాటి ఎటువంటిదో చెప్పవచ్చు. 1994లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పయ్యావుల... ఆ తర్వాత వైఎస్ఆర్ ప్రభంజనాన్ని తట్టుకొని 2004,2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక, తాజాగా 2019లో వైసీపీ హవాకు ఎదురొడ్డి మరీ తన కరిష్మాతో గెలుపొందారు పయ్యావుల. అసెంబ్లీలో అధికార పార్టీ వైసీపీపై తన వాగ్దాటితో పయ్యావుల విమర్శలు గుప్పించారు. అటువంటి, పయ్యావుల గళం కొద్ది రోజులుగా మూగబోయింది. ఇటు మీడియాలోనూ...అటు పార్టీ కార్యక్రమాల్లోనూ పయ్యావుల కనిపించకపోవడంపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
అయితే, పయ్యావుల మౌనం వెనుక అనేక కారణాలున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధిష్టానం తనను చిన్నచూపు చూస్తోందని, అందుకే టీడీపీ అధికారంలో ఉన్నపుడు తనకు ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి దక్కలేదని పయ్యావుల అసంతృప్తితో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. 1994లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పయ్యావులకు మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, సలహాలు సూచనలు చేసే పయ్యావులకు 1999 ఎన్నికల తర్వాత మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. అయితే, పయ్యావుల ఆ ఎన్నికల్లో ఓడిపోగా...టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇక, 2004,2009లలో వైఎస్ ఆర్ హవాను తట్టుకొని వరుసగా పయ్యావు గెలుపొందినా ఫలితం లేకపోయింది. అయితేనేం, పీఏసీ చైర్మన్ గా, విపక్ష నేతగా నాటి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టారు పయ్యావుల. నిరాశ నిస్పృహల్లో ఉన్న పార్టీ శ్రేణులకు చంద్రబాబు ప్రోత్సాహంతో పయ్యావుల దిశా నిర్దేశం చేశారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచినా...పయ్యావుల ఓడారు.
అయితే, పయ్యావులకు ఎమ్మెల్సీ పదవి దక్కినా నాటి సామాజిక సమీకరణాల దృష్ట్యా మంత్రి పదవి దక్కలేదు. ఇక, 2019 ఎన్నికల్లో పయ్యావుల గెలిచినా పార్టీ అధికారంలోకి రాలేదు. దీంతో, పయ్యావులకు మంత్రిపదవి ‘అందని ద్రాక్ష’గా మిగిలింది. 2014లో మంత్రి పదవి దక్కుతుందని పయ్యావుల ఆశించి భంగపడ్డారని తెలుస్తోంది. ఈ విషయంలోనే టీడీపీ అధిష్ఠానంపై పయ్యావుల గుర్రుగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, వైసీపీలోకి వెళ్లబోనని పయ్యావుల బల్లగుద్ది మరీ చెప్పారు. టీడీపీ తనను చిన్న చూపు చూస్తోందన్న ఆలోచనలో పయ్యావుల ఉన్నట్లు అనంతపురం నేతలు అనుకుంటున్నారు. సమకాలీన రాజకీయాలపై అనర్గళంగా మాట్లాడగలిగి, వైసీపీని ఇరుకున్న పెట్టగలిగిన పయ్యావుల మౌనంగా ఉండడంపై టీడీపీ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పయ్యావుల మౌనం వెనుక మర్మమేమిటో చంద్రబాబు కనుక్కోవాలని అభిప్రాయపడుతున్నారు. జగన్ సర్కార్ పై పయ్యావుల విమర్శలు గుప్పించాలని టీడీపీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.