Begin typing your search above and press return to search.

జనతా కర్ఫ్యూ ఆ రోజే ఎందుకు?

By:  Tupaki Desk   |   21 March 2020 2:30 AM GMT
జనతా కర్ఫ్యూ ఆ రోజే ఎందుకు?
X
కరోనా వైరస్ వేళ..ప్రధాని మోడీ పవర్ ఫుల్ స్పీచ్ ఇవ్వటం తెలిసిందే. మంచి మాటకారి అయిన ప్రధాని నోటి నుంచి కరోనా లాంటి టెన్షన్ మూడ్ ను తగ్గించేలా ఆయన ప్రయత్నాలు చేస్తారన్న అంచనాకు తగ్గట్లే ఆయన తీరు ఉందని చెప్పాలి. కరోనా గురించి ఇప్పటికే చాలా తెలిసిన అంశాల్ని.. వెబ్ సైట్లు.. సోషల్ మీడియాలో తిరుగుతున్న వివరాల్ని వెల్లడించిన ఆయన..కొద్దిరోజుల క్రితం ఫ్రాన్స్ అధినేత దేశ ప్రజల్ని ఇళ్లల్లోని బాల్కనీ.. తలుపుల వద్ద నిలుచొని వైద్యులకు.. వైద్య సిబ్బందికి చప్పట్లు..నినాదాలు చేయటం ద్వారా వారికి థ్యాంక్స్ చెప్పాలనటం తెలిసిందే.

ఇదే మాట మోడీ నోటి నుంచి రావటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ నెల 22న అంటే.. ఆదివారం దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఎవరికి వారు ఇళ్లల్లోనే ఉండాలని.. జనతా కర్ఫ్యూ పాటించాలన్న పిలుపునిచ్చారు. మోడీ నోటి నుంచి మాట వచ్చినంతనే.. ఆయన వర్గానికి చెందిన పరివారం సోషల్ మీడియాలోనూ.. మీడియాలోనూ ఫుల్ బిజీ అయిపోయారు. ఆదివారం జనతా కర్ఫ్యూ మాట మోడీ నోటి నుంచి ఎందుకు వచ్చిందో తెలుసా? అంటూ వాదనలు వినిపించటం షురూ చేశారు.

వైరస్ ను పద్నాలుగు గంటల పాటు టచ్ చేయకుండా ఉంటే అది చనిపోతుందని.. ప్రధాని మోడీ చెప్పినట్లు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ అంటే.. పదిహేను గంటలు ఎవరికి వారు ఇళ్లల్లో ఉండటం వల్ల.. వైరస్ నిర్మూలించే వీలు ఉందన్న మాటను వినిపిస్తున్నారు. విన్నంతనే ఈ మాటలు మనసు మీద ప్రభావితం చూపించటమే కాదు.. నిజమే కదా? అన్న భావన కలుగుతుంది.అయితే.. ఇదెంత వరకూ వర్క్ వుట్ అవుతుందన్నది చూస్తే.. హెల్మెట్ పెట్టుకుంటే ప్రమాదం జరిగినా ప్రాణాలు పోవన్న మాటను ఎంతమంది పట్టించుకుంటున్నారు? తాగి వాహనం నడపటం నేరం.. అలా చేయటం ద్వారా మీరు మాత్రమే కాదు.. మీతో ఏ మాత్రం సంబంధం లేని వారు సైతం ప్రమాదం బారిన పడతారని చెప్పినా ఎంతమంది వింటున్నారు?

అక్కడి దాకా ఎందుకు అతివేగంతో వాహనం నడిపితే.. థ్రిల్ వస్తే రావొచ్చేమో కానీ.. దాని కారణంగా ఉండే ముప్పు భారీగా ఉంటుందన్న మాటను ఎంతమంది వింటున్నారు? ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో అంశాల్ని పట్టించుకోని దేశ ప్రజలు.. జనతా కర్ప్యూ విషయంలో ఎంతటి శ్రద్ధను ప్రదర్శిస్తారన్నది ప్రశ్న. ఇంతకీ ఆదివారం ఎందుకంటే? ఆ రోజుసెలువు కావటంతో.. తాను పిలుపునిచ్చినట్లుగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ మోడీ మాటల్ని కచ్ఛితంగా అమలు చేస్తారా? అన్నది ప్రశ్న.

ఇదంతా చూసినప్పుడు ప్రచారం కోసమో.. కరోనా వేళ.. మైలేజీ కోసమే మోడీ ఇలా మాట్లాడారా? అన్న సందేహం కలుగక మానదు ఎందుకంటే.. మన లాంటి దేశంలో.. ప్రధాని జనతా కర్ఫ్యూ కోసం పిలుపునిచ్చి.. దాన్ని ఫాలో అయితే.. అంతకు మించిన విజయం ఏముంటుంది? ఇదంతా దేశ క్షేమం కోసమే అయితే.. వరుసగా మూడు రోజుల పాటు.. యావత్ దేశం మొత్తం కర్ఫ్యూనుపాటించాలని.. మరీ ముఖ్యమైతే తప్పించి బయటకు వెళ్లొద్దని చెప్పి.. ఆ మాటల్ని అందరూ పాటిస్తే.. ఒనగూరే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది కదా? అలాంటప్పుడు ఒకరోజు జనతా కర్ప్యూ కంటే మూడురోజుల కర్ఫ్యూతోనే మరింత మేలు జరుగుతుంది కదా?