Begin typing your search above and press return to search.
మెట్రో రైలు-మోడీ మారాం... సీక్రెట్ తెలిసింది!
By: Tupaki Desk | 19 Nov 2017 5:49 AM GMTహైదరాబాద్ మెట్రో రైలు కోసం ఎన్నోఏళ్లుగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 28న హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ రోజు వరకు మోడీ ఆఫీసు నుంచి మెట్రో రైల్ ప్రారంభం కోసం ప్రధాని వస్తున్నట్లుగా అధికారిక సమాచారం ఇంకా రాలేదు. ఎందుకిలా? అప్పుడెప్పుడో రెండు.. మూడు నెలల క్రితమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీకి ఒక లేఖ రాశారు.
గతంలో తాను వ్యక్తిగతంగా వచ్చి కలిసినప్పుడు మెట్రో రైల్ ప్రారంభానికి రావాలని కోరానని.. అందుకు మోడీ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. అదే లేఖలో నవంబరు 28-30లలో మెట్రో రైలును ప్రారంభించటానికి రావాల్సిందిగా కోరారు.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాసిన తర్వాత ప్రధాని కార్యాలయం అందుకు సంబందించిన స్పందనను తెలియజేస్తుంది. ముఖ్యమంత్రి దాకా ఎందుకు సామాన్యుడు సైతం తాను ఏదైనా విషయం మీద లేఖ రాస్తే అందుకు స్పందనగా లేఖ వస్తుంది. కానీ.. మెట్రో రైల్ ఎపిసోడ్ లో మాత్రం అలా జరగలేదు. ఓపెనింగ్ డేట్ గా అనుకుంటున్న నవంబరు 28కి కేవలం ఎనిమిది రోజులు మాత్రమే టైం ఉన్నప్పటికీ.. ఈ రోజుకీ అధికారికంగా మోడీ వస్తున్నట్లుగా సమాచారం రాలేదు. ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక కన్ఫర్మేషన్ రాకుంటే ఓపెనింగ్‌కు సంబంధించిన ముఖ్యమైన పనులు మొదలు పెట్టలేరు.
క్యాలెండర్లో డేట్ మారుతున్న కొద్దీ మెట్రో.. ఎల్ అండ్ టీ అధికారులకు నిద్ర పట్టటం లేదు. ఇంతకీ ప్రధాని కార్యాలయం మెట్రోరైలు ఓపెనింగ్ విషయంలో ఎందుకు స్పందించటం లేదు? అంటే ఆసక్తికరమైన విషయం తాజాగా బయటకు వచ్చింది. ఓపెనింగ్ వేళ 30 కిలోమీటర్ల దూరానికి 24 స్టేషన్లతో హైదరాబాద్ మెట్రోను సిద్ధం చేస్తున్నారు. అంతా బాగుంది కానీ.. మెట్రో భద్రతా కమిషనర్ ఇవ్వాల్సిన ధ్రువపత్రం ఇంకా జారీ కాలేదు. ఏమిటీ ధ్రువపత్రం అంటే.. సినిమా విడుదలకు సెన్సార్ సర్టిఫికేట్ ఎలా అవసరమో.. మెట్రో రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రావాలంటే.. సేఫ్టీ కమిషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ చాలా అవసరం. ప్రస్తుతం ప్రారంభించాలని భావిస్తున్న 30 కిలోమీటర్లలో 10 కిలోమీటర్ల మేర ట్రాక్ ను ఈ మద్యనే పూర్తి చేశారు. గతంలో పూర్తి చేసిన ట్రాక్ ను పరిశీలించి.. క్షుణ్ణంగా పరీక్షించిన అధికారులు సేఫ్టీ సర్టిఫికేట్ జారీ చేశారు.
కానీ.. మొత్తం ట్రాక్ కు ఇవ్వలేదు. సర్టఫికేట్ ఇస్తేనే ప్రధాని కార్యాలయం స్పందించే అవకాశం ఉంటుంది. ప్రధాని కార్యాలయం ఓకే అన్న తర్వాత.. ఏదైనా సాంకేతిక సమస్య ఎదురైతే.. పీఎంవో అభాసుపాలు అవుతుంది. అంతేకాదు.. భ్రదతకు సంబంధించిన కీలక ధ్రువపత్రం విడుదల కాకుండా ప్రధాని తన కార్యక్రమాన్ని ఖరారు చేయటం కూడా సరికాదు.
ఈ నేపథ్యంలో ఈ పత్రం కోసం ఎదురుచూస్తున్న పీఎంవో కేసీఆర్ లెటర్‌కు రియాక్ట్ కాకుండా మౌనంగా ఉంటోంది. శనివారం కూడా భద్రతా పరమైన పరీక్షల్ని నిర్వహించారు. అన్ని అనుకున్నట్లు జరిగితే సోమవారం లేదంటే మంగళవారం సేఫ్టీ పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్ ఢిల్లీకి చేరుతుంది. అక్కడ ఆమోద ముద్ర పడగానే.. పీఎంవో ఓకే చెబుతుంది. అక్కడ నుంచి అధికారికంగా తెలంగాణ ప్రభుత్వానికి మోడీ విజిట్‌కు సంబంధించి సమాచారం అందుతుంది. అది వచ్చిన వెంటనే మెట్రో రైలు ప్రారంభోత్సవానికి అవసరమైన తుది ఏర్పాట్లను మొదలెడతారు. తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాసిన రెండున్నర నెలలకు కూడా మోడీ ఆఫీసు ఎందుకు రియాక్ట్ కాలేదో అర్థమైందా?