Begin typing your search above and press return to search.
ప్రజాశాంతి పార్టీ..పోటీ చేస్తున్నది అందుకే!
By: Tupaki Desk | 26 March 2019 6:21 AM GMTప్రకాశం జిల్లా పర్చూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు - ఇదే నియోజకవర్గంలో కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి పేరు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిందని అనుకుంటున్నారా? అయితే తర్వాతి కథ వినండి.
నందిగామలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరు జగన్ మోహన్ రావు - ఇదే నియోజకవర్గంలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి పేరు జగన్ మోహన్ రావు. ఇంటి పేర్లు మాత్రమే తేడా.
అలాగే పెదకూరపాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరు నంబూరి శంకర్రావు. ఇదే నియోజకవర్గంలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి పేరు కూడా ఇదే… నంబూరి శంకర్రావు.
ఈ నియోజకవర్గాలు మాత్రమే కాదు..ఒక్కఅనంతపురం జిల్లాలోనే ఎనిమిది నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను కలిగిన వారి చేతే ప్రజాశాంతి పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు అయ్యాయి.ఇంకా నామినేషన్ల పరిశీలన మొత్తం పూర్తి అయితే - రాష్ట్రం వ్యాప్తంగా ఎన్ని నియోజకవర్గాల్లో ఇలా జరిగిందో స్పష్టత రానుంది. ఏదో ఒక చోట అంటే యాదృచ్చికం అనుకోవచ్చు. ఇలా పదుల సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను పోలి ఉన్న పేర్లతోనే ప్రజాశాంతి పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు అయ్యాయంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు అంటున్నారు.
ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ గుర్తు విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీకి ఫిర్యాదు చేసింది. ఫ్యాన్ గుర్తును తలపింపజేసేలా హెలీకాప్టర్ గుర్తును తెచ్చుకున్నారని వైకాపా నేతలు ఫిర్యాదు చేశారు. ఇక అభ్యర్థుల కథ ఇలా ఉంది. ఈవీఎంల వద్ద గందరగోళం రేపి..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లను కొద్దో గొప్పో చీల్చడానికే ప్రజశాంతి పార్టీని బరిలోకి నిలిపారని స్పష్టం అవుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.