Begin typing your search above and press return to search.
పురందీశ్వరికి రాజ్యసభ ఎందుకు మిస్ అయిందంటే..
By: Tupaki Desk | 12 March 2018 4:13 PM GMTరాజ్యసభ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏపీలో కొత్త టాపిక్ తెరమీదకు వచ్చింది. అభ్యర్థుల ఖరారు పూర్తయినప్పటికీ ఈ ఆసక్తికరమైన చర్చ జరగడం ఎవరి గురించి అంటే...మాజీ కేంద్ర మంత్రి - ఏపీకి చెందిన బీజేపీ ముఖ్యనేతల్లో ఒకరైన దగ్గుబాటి పురందీశ్వరికి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పురందీశ్వరికి త్వరలో ప్రమోషన్ దక్కనుందని - ఆమెను జాతీయ రాజకీయాల్లోకి తీసుకువెళ్లేందుకు బీజేపీ పెద్దలు సిద్ధమవుతున్నారని కొద్దికాలం క్రితం జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
దక్షిణాదిలో బీజేపీకి అత్యంత కీలక రాష్ట్రమైన కర్ణాటక నుంచి రాజ్యసభ బరిలో దిగడం ద్వారా పురందీశ్వరి చట్టసభలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారనే చర్చ జోరుగా వినిపించింది. పార్టీలో చేరింది మొదలుకొని ఇప్పటివరకు నిబద్దతతో పనిచేయడం - పార్టీ బలోపేతానికి కృషిచేయడం ప్రధాన కారణంగా చెప్తున్నారు. దీంతోపాటుగా త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగడం మరో కారణంగా వివరిస్తున్నారు. కర్ణాటకలో కన్నడిగుల తర్వాత అత్యధికులు తెలుగువారే. దివంగత విఖ్యాత నటుడు ఎన్టీఆర్ వారందరికీ సుపరిచతుడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తనయకు అవకాశం కల్పించడం ద్వారా ఆ రాష్ట్రంలోని తెలుగువారికి సానుకూల సందేశం పంపించినట్లు అవుతుందని అంటున్నారు. తద్వారా రాబోయే ఎన్నికల్లో వారి ఓట్లను రాబట్టుకునేందుకు అవకాశం దక్కుతుందని బీజేపీ పెద్దల ఆలోచనగా వివరించారు.
అయితే ఈ చాన్స్ దక్కకపోవడం వెనుక స్థానికత అంశమే కారణమని సమాచారం. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారం చేజిక్కించుకునేందుకు రాజ్యసభ ఎన్నికల్ని ఉపయోగించుకోవాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్య వ్యూహం రచించారు. కన్నడిగులనే రాజ్యసభకు పంపాలన్న తన వాదనను పార్టీ అధిష్ఠానం ఎదుట వినిపించారు. దీంతో బీజేపీ సైతం అలర్ట్ అయింది. ఈ క్రమంలోనే పురందీశ్వరికి చాన్స్ దక్కలేదని సమాచారం.