Begin typing your search above and press return to search.
రవిశాస్త్రీ.. మరీ ఇంత భజనా?
By: Tupaki Desk | 20 July 2017 7:15 AM GMTభారత క్రికెట్ జట్టు కోచ్ గా అనిల్ కుంబ్లే ఎందుకు తప్పుకున్నాడో అందరికీ తెలుసు. అతనో స్ట్రిక్ట్ కోచ్. రూల్స్ విషయంలో కొంచెం కఠినం. అక్కడే కోహ్లి బృందానికి తేడా వచ్చేసింది. విభేదాలు మొదలయ్యాయి. చివరికి కుంబ్లే ఏడాది తిరక్కుండానే కోచ్ పదవి నుంచి తప్పుకోక తప్పని పరిస్థితి వచ్చింది. ఇక ఆ తర్వాత కోచ్ పదవికి ఇంటర్వ్యూలంటూ ఓ మొక్కుబడి తతంగం పెట్టారు.
గత ఏడాది కుంబ్లేను కోచ్ గా చేయాలని గంగూలీ ముందే ఫిక్సయి.. రవిశాస్త్రికి మొక్కుబడిగా ఇంటర్వ్యూ తతంగం ముగించినట్లే.. ఈసారి కూడా రవిశాస్త్రిని కోచ్ చేయాలనే విషయంలో ముందే ఫిక్సయి.. సెహ్వాగ్.. టామ్ మూడీ లాంటి వాళ్లకు ఇంటర్వ్యూలు మొక్కుబడిగా లాగించారన్నది బహరింగ రహస్యం. ఐతే గత ఏడాది రవిశాస్త్రిని అంతగా వ్యతిరేకించిన గంగూలీ.. ఈసారి సచిన్ ఒత్తిడికి తలొగ్గాడు.
నిరుడు కుంబ్లే విషయంలో నీ అభిప్రాయాన్ని గౌరవించా కాబట్టి.. ఈసారి రవిశాస్త్రి విషయంలో నా మాట మన్నించు అన్నట్లుగా సచిన్ గంగూలీని ఒప్పించాడన్నది భారత క్రికెట్ వర్గాల సమాచారం. గత ఏడాది తనకు ఎదురైన పరిణామాల్ని దృష్టిలో ఉంచుకుని రవిశాస్త్రి ఈసారి కోచ్ పదవికి దరఖాస్తు చేయడానికే అంగీకరించలేదు. నేరుగా పదవి ఇస్తే తీసుకుంటా.. దరఖాస్తు మాత్రం చేయనంటూ అతను బెట్టుచేయడం తెలిసిన సంగతే. ఐతే సచినే అతణ్ని ఒప్పించి దరఖాస్తు చేయించాడు.
సచిన్ హామీ మేరకే రవిశాస్త్రి దరఖాస్తు చేశాడన్నది బహిరంగ రహస్యం. ఇంటర్వ్యూ చేసే కమిటీలో ఉన్న వ్యక్తి.. నేను చూసుకుంటా దరఖాస్తు చెయ్యి అని హామీ ఇవ్వడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించే వాళ్లు లేరు. తర్వాత అంతా స్క్రిప్టు ప్రకారమే కోచ్ గా రవిశాస్త్రి ఎంపిక ముగిసింది. కోచ్ ఎవరన్నది ముందే అందరికీ అర్థమైపోయింది. ఇంటర్వ్యూ ప్రక్రియ ఒక కామెడీలా తయారైంది.
ఇంతకుముందు టీమ్ ఇండియా డైరెక్టర్ గా ఉన్న సమయంలో రవిశాస్త్రి కెప్టెన్ కోహ్లిని ఎంతగా మోసేవాడో తెలిసిందే. కుంబ్లేతో తేడా వచ్చింది కూడా ఇక్కడే. కుంబ్లే వెళ్లిపోయాక కోహ్లి కూడా రవిశాస్త్రే కోచ్ కావాలని కోరుకున్నాడు. రవిశాస్త్రికి సచిన్-గంగూలీ-లక్ష్మణ్ కమిటీ పచ్చజెండా ఊపడానికి అది కూడా ఓ కారణం. దీన్ని బట్టి రవిశాస్త్రి కోచ్ కావడంలో కోహ్లి.. సచిన్ లది కీలక పాత్ర అని చెప్పొచ్చు.
అందుకే రవిశాస్త్రి కోచ్ కావడం ఆలస్యం.. ఏ మొహమాటం లేకుండా వీరి భజన మొదలుపెట్టేశాడు. కోచ్ గా తనను ప్రకటించిన మరుసటి రోజే కోహ్లిని ఆకాశానికెత్తేశాడు. అసలైన కోహ్లి ఏంటో వచ్చే ఐదు పదేళ్లలో చూస్తారంటూ.. అతనో అద్భుతమైన ఆటగాడని.. కెప్టెన్ అని మోసేశాడు. తాజాగా సచిన్ మీద తన భక్తిని చాటుకునే ప్రయత్నం చేశాడు. సచిన్ ను టీమ్ ఇండియాకు సలహాదారుగా నియమించాలని బీసీసీఐని కోరాడు.
ఇప్పటికే రవిశాస్త్రితో పాటు భారత జట్టుకు ముగ్గురు సహాయ కోచ్ లు ఉన్నారు. అయినప్పటికీ సచిన్ సలహాదారుడిగా కావాలట. సచిన్ కు ఉన్న హోదా.. కమిట్మెంట్ల దృష్ట్యా అతను ఈ పదవి తీసుకోవడానికి అంగీకరించడని రవిశాస్త్రికి కూడా తెలుసు. అయినప్పటికీ రవిశాస్త్రి అతను సలహాదారుడిగా కావాలనడం ద్వారా తాను కోచ్ కావడానికి కారణమైన సచిన్ మీద తన అభిమానాన్ని చాటుకుంటున్నాడన్నమాట.
ఓవైపు రాహుల్ ద్రవిడ్.. జహీర్ ఖాన్ లాంటి వాళ్లను బ్యాటింగ్.. బౌలింగ్ సలహాదారులుగా కమిటీ సూచించింది. వాళ్లు కూడా అందుకు సుముఖత వ్యక్తం చేశారు. కానీ వాళ్లను అంగీకరించకుండా తన భరత్ అరుణ్.. ఆర్.శ్రీధర్ లాంటి పెద్దగా పేరు లేని కోచ్ లే తనకు కావాలని పట్టుబట్టి వాళ్లకు పదవులిప్పించుకున్న రవిశాస్త్రి.. సచిన్ ను సలహాదారుడిగా కోరడంలో ఆంతర్యమేంటో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇది సాధ్యం కాదని తెలిసి కూడా సచిన్ మీద తన భక్తిని చాటుకోవడానికి ఓ మాట పడేయడం తప్ప మరేమీ కాదు.