Begin typing your search above and press return to search.

అసలు రోహిత్ ను ఎందుకు సస్పెండ్ చేశారు?

By:  Tupaki Desk   |   20 Jan 2016 5:14 AM GMT
అసలు రోహిత్ ను ఎందుకు సస్పెండ్ చేశారు?
X
సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే.. ఎందుకింత వివాదంగా మారింది? లాంటి విషయాల్ని కాసేపు పక్కన పెట్టి.. అసలు రోహిత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? దానికి కారణం ఏమిటి? రోహిత్ ఆత్మహత్య వెనుక కేంద్రమంత్రుల హస్తం ఉందా? లాంటి ప్రశ్నలకు సమాధానం వెతకాలంటే మరికొన్ని ప్రశ్నలు వేసుకుంటే విషయం అంతా అర్థమవుతుంది.

రోహిత్ ఆత్మహత్యకు కారణం అతన్ని వర్సిటీ నుంచి సస్పెండ్ చేయటంగా చెబుతున్నారు. మరి.. అతన్ని ఎందుకు సస్పెండ్ చేశారు? సస్పెండ్ చేసేంత తప్పు రోహిత్ లాంటి విద్యార్థి ఏం చేశాడన్న విషయంలోకి వెళితే.. ఆ మధ్యన ముంబయి పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడిన యాకూబ్ మెమన్ కు ఉరి వేసిన సంగతి తెలిసిందే. దీన్ని కొందరు వ్యతిరేకించారు. అలా వ్యతిరేకించిన వారిలో రోహిత్ ఒకడు.

అయితే.. అభిప్రాయ బేధాలు అక్కడితో ఆగిపోలేదు. సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న ఏబీవీపీ సంస్థకు చెందిన సుశీల్ యాకూబ్ మెమన్ ఉరితీతను సమర్థించాడు. దీనిపై సోషల్ మీడియాలో కామెంట్ పెడితే.. అతనిపై అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ కు చెందిన 30 మంది విద్యార్థులు సుశీల్ మీద దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అతివాద వైఖరి ఉన్న ఈ సంస్థకు చెందిన వాడే రోహిత్ ఒకడు. యాకూబ్ మెమన్ ఉరితీతను బలంగా సమర్థించటంతో పాటు.. ఏబీవీపీ సభ్యులపై దాడికి పాల్పడిన వారికి నేతృత్వం వహించిన వారిలో రోహిత్ ఒకడు. ఈ అంశమే అతనిపై వర్సిటీ చర్యలు తీసుకునేలా చేసింది. వందలాది మంది ప్రాణాలు తీసిన ముంబయి పేలుళ్ల కేసులో దోషి అయిన వ్యక్తికి రోహిత్ లాంటి పీహెచ్ డీ స్కాలర్ సమర్థించటం ఏమిటి? పేలుళ్ల కారణంగా మరణించిన అమాయకులెవరూ రోహత్ కు గుర్తుకు రారా? వారు మనుషులు కాదనుకున్నాడా? లాంటి ప్రశ్నల్ని పలువురు సంధిస్తున్నారు.