Begin typing your search above and press return to search.
బాబుపై తమిళపత్రిక పొగడ్తలు.. కారణం ఇదీ..
By: Tupaki Desk | 18 Feb 2018 5:53 AM GMTముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి.. అందరూ ఆయన్ను చూసి నేర్చుకోవాలి.. రాష్ర్టాన్ని ప్రగతి పథంలో పరుగులు తీయిస్తున్నారు.. ఆదర్శ ముఖ్యమంత్రి ఆయన అంటూ ఏపీ సీఎం చంద్రబాబును ఆకాశానికెత్తేస్తూ తమిళ పత్రిక ఒకటి నాలుగు పేజీల కథనం రాసింది. చంద్రబాబు చెప్పే గొప్పలన్నీ అందులో వల్లెవేసింది. దీంతో తెలుగుదేశం పార్టీ దాన్ని ఐఎస్ ఓ సర్టిఫికేషన్ లా భావించి తెగ ప్రచారం చేసుకుంటోంది. ఇంతకీ.. ఆ పత్రిక ఎవరిది.. ఎందుకంత మోసేసింది అంటే అందుకు అసలు కారణం ఉంది.
చంద్రబాబుని ఆకాశానికెత్తేసిన ఆ పత్రిక పేరు పొదియ తలైమొరై.. మరి, ఆ పత్రిక ఎందుకంత ప్రయారిటీ ఇచ్చిందో తెలుసా? దీని వెనుక చాలాకారణం ఉంది. ఈ పత్రిక ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ప్రెసెడెంట్ పి.సత్యనారాయణకు చెందిన పత్రిక. బీజేపీతో రాజకీయ సంబంధాలున్న వ్యక్తి. అంతేకాదు... ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీకి ఏపీ రాజధాని అమరావతిలో 200 ఎకరాల భూమి కేటాయించిన సంగతి తెలిసిందే.
పైగా భూమి కేటాయించిన తరువాత అందులో 100 ఎకరాల్లో ఆగమేఘాల మీద కేవలం 5 నెలల కాలంలో భవనాలు నిర్మించేసి గత ఏడాది జూన్ లో యూనివర్సిటీ ప్రారంభించేశారు కూడా. అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాల భవనాలకు దిక్కు లేకపోయినా తమకు 200 ఎకరాలు ఇచ్చాక కనీసం సొంత పత్రికలో ఆమాత్రం భజన చేయక మానుతారా? అందుకే నిత్యం తమిళనాడు వార్తలతో సమానంగా చంద్రబాబు వార్తలను కవర్ చేస్తున్నారు. అది చాలదన్నట్లుగా ఇప్పుడు ఏఖంగా ముఖచిత్ర కథనం వేసి తెలుగులోని ఆ రెండు పత్రికలకు జత కలిసిపోయింది.