Begin typing your search above and press return to search.

లీడర్లంతా టీడీపీని వదిలి ఎందుకు పోతున్నారు.?

By:  Tupaki Desk   |   16 Feb 2019 6:25 AM GMT
లీడర్లంతా టీడీపీని వదిలి ఎందుకు పోతున్నారు.?
X
రాజకీయ నాయకులకు నమ్మకాలు ఎక్కువ. దైవబలాన్ని - శాస్త్రాల్ని ముహూర్తాల్ని నమ్మే రాజకీయ నాయాకులు.. అదే టైమ్‌ లో లాజిక్‌ కు బాగానే పట్టించుకుంటారు. ఇంకా చెప్పాలంటే నాయక్‌ సినిమాలో పోసాని చెప్పినట్లు.. ఫామ్‌ లో ఉన్న లీడర్‌ని ఫాలో అవ్వడమే తెలివైన వాడి పని. అందుకే.. ఇప్పుడు ఫామ్‌ లో జగన్‌ దగ్గరకు వెళ్లిపోతున్నారు. అయితే.. ఇన్నాళ్లూ టీడీపీలో ఉన్న కీలక నేతలు సడన్‌ గా వైసీపీలోకి ఎందుకు వెళ్తున్నారు అంటే దానికి కొన్ని కారణాలు లేకపోలేదు.

ప్రతీ ఎంపీ - ఎమ్మెల్యే.. ఎన్నికలకు ఆరు నెలల ముందే తన నియోజకవర్గంలో సర్వేలు చేయించుకుంటాడు. ప్రభుత్వం పనీతీరు ఎలాఉంది - అప్పోజిషన్‌ ఎలా ఉంది - ప్రజలు ఈ సారి ఎవరి పక్షాల నిలబడేందుకు అవకాశం ఉంది లాంటి అంశాలన్నింటికి బేరీజు వేసుకుని లెక్కలు కడతాడు. ఈ లెక్కలు అధికారపక్షానికి అనుకూలంగా ఉంటే అందులోనే ఉండిపోతారు. తేడాగా ఉండే పార్టీ మారతారు. ఇది ఒక లాజిక్‌. ఇక అధినేత తమకు సీటు ఇచ్చే అవకాశం లేదని ఉప్పందినా సరే.. వెంటనే పార్టీ మారిపోతారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండే సీటు తెచ్చుకోకపోతే అంతకంటే అవమానం ఇంకోటి ఉండదు. ఇక ఇంకొంతమంది మాత్రం ఎంపీగా పోటీ చేయాలనో - ఎమ్మెల్యేగా పోటీ చేయాలనో పార్టీగా మారతారు. అన్నింటికి మించి.. ఇప్పుడు టీడీపీ లీడర్లు అందరూ పార్టీ వదిలి వెళ్లిపోవడానికి అసలు రీజన్‌ సర్వేలే. లోకల్‌ నుంచి జాతీయ స్థాయి వరకు అన్నీ సర్వేలు జగన్‌ కు అనూకూలంగా వస్తున్నాయి. ఇలాంటి టైమ్‌ లో వైసీపీలోకి వెళ్తే.. గెలిచినా ఓడినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే.. టీడీపీలో ఇబ్బందులు పడుతున్న రాజకీయ నేతలంతా.. ఇప్పుడు జగన్‌ వైపు వెళ్లిపోతున్నారు.