Begin typing your search above and press return to search.
వల్లభనేని వంశీ వ్యూహం ఫలిస్తుందా...!
By: Tupaki Desk | 25 Oct 2019 2:30 PM GMTగన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పార్టీలకి అతీతంగా ఒక ఇమేజ్ వుంది. ఆ ఇమేజ్ తోనే ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ జోరు వీచినా కూడా తన సొంత ఇమేజ్ తో గన్నవరం లో విజయం సాధించారు. కానీ , టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఘోరంగా ఓడిపోయింది. దీనితో టీడీపీ లో ఉన్న కీలక నేతలు ఒక్కొకరుగా తమదారి చూసుకుంటున్నారు. పార్టీలో ఉంటే పరాభవం తప్పదు అని భావించి ఇతర పార్టీల వైపు తొంగిచూస్తున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు బీజేపీలో చేరిపోయారు.
ఇదే క్రమంలో తాజాగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా పార్టీ మారబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి ఆజ్యం పోస్టు వంశీ కూడా టీడీపీ అధికారికంగా చేసే ఏ కార్యక్రమాలలో కూడా పాల్గొనడంలేదు. అలాగే వంశీ పై తాజాగా ఫోర్జరీ కేసు కూడా నమోదుచేశారు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తో రెండు సార్లు భేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా కేసుల విషయం పై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. అలాగే తాజాగా ఈ సాయంత్రం వంశీ సీఎం జగన్ తో భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.
తనపై పెట్టిన అక్రమ కేసులను సీఎంకు వంశీ వివరించినట్లు సమాచారం. సుమారుగా అరగంటపాటు జగన్ తో వల్లభనేని మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. తనపై అన్యాయంగా కేసులు పెట్టినట్టు సీఎం జగన్ కి వంశీ వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది. నకిలీ పట్టాల కేసులో వంశీని పోలీసులు అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం తో భేటీ కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ఈ భేటీ చివర్లో జగన్ తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వంశీ తెలిపినట్టు సమాచారం. కానీ , వంశీ టీడీపీ ని వీడి ..వైసీపీ లో జాయిన్ కావాలి అంటే ..తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఎన్నికలు జరిగి ఆరునెలలు కుడా కాకముందే వంశీ తన పదవికి రాజీనామా చేయడానికి ఒప్పుకుంటారో లేదో ..కానీ , వైసీపీ లో చేరాలి అంటే మాత్రం కచ్చితంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే కానీ సీఎం జగన్ పార్టీ లో రానివ్వరు. కేసుల కోసమే సీఎం జగన్ ని కలిసారా ..లేక వైసీపీలోకి చేరతారా అనే విషయం తెలియాలి అంటే వేచి చూడాల్సిందే..