Begin typing your search above and press return to search.

బాబూ.. విశ్వసనీయతతో గెలవలేదు

By:  Tupaki Desk   |   14 Aug 2015 11:27 AM GMT
బాబూ.. విశ్వసనీయతతో గెలవలేదు
X
నవ్యాంధ్ర ప్రజలు ఎంతో విజ్ఞతతో వ్యవహరించి తనకు అధికారాన్ని కట్టబెట్టారని, తాను అయితేనే తీవ్రంగా నష్టపోయిన నవ్యాంధ్రను పునర్నిర్మించగలననే ఉద్దేశంతోనే టీడీపీకి అధికారం కట్టబెట్టారని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పుకొంటున్నారు. అయితే, నవ్యాంధ్ర ప్రజలు చంద్రబాబును నమ్మి టీడీపీకి అధికారం కట్టబెట్టలేదని, టీడీపీకి అధికారం కేవలం పవన్ కల్యాణ్ దయ అని, పవన్ కల్యాణ్ కనక లేకపోతే ఈపాటికి వైసీపీ అధికారంలో.. టీడీపీ ప్రతిపక్షంలో ఉండేవని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నాలుగు ఎక్కువ సీట్లు వచ్చింది ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఓ మాదిరిగా వస్తే.. నెల్లూరు సహా రాయలసీమలో ఆ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఉత్తరాంధ్రతోపాటు గోదావరి జిల్లాల్లో నరేంద్ర మోదీతో జత కలిసిన పవన్ కల్యాణ్ కారణంగా కాపు సామాజిక వర్గం అనివార్యంగా టీడీపీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. ఆ పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా బీజేపీ ఒంటరిగా పోటీ చేసినా ఆ పార్టీకి మంచి సీట్లు వచ్చేవని, ఉత్తరాంధ్రతోపాటు గోదావరి జిల్లాల్లో బీజేపీ కూడా స్వీప్ చేసేసి ఉండేదని విశ్లేషిస్తున్నారు.

కాంగ్రెస్ పై వ్యతిరేకత, బీజేపీపై అనుకూలత, పవన్ కల్యాణ్ కాపు సామాజిక వర్గం కలిసి టీడీపీకి అధిక సీట్లు రావడానికి కారణమని, అంతే తప్పితే రాజధానిని ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే నిర్మిస్తాడని చెప్పి ఆయనకు ఓటు వేయలేదని గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు జగన్ కూడా కారణమని టీడీపీ ప్రచారం చేయడం.. అందుకు ఆయన బెయిల్ ను అడ్డం పెట్టుకోవడం.. మోదీ, పవన్ కల్యాణ్ కలిసి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి కారణమని వివరిస్తున్నారు. మోదీ, పవన్ కల్యాణ్ మైనస్ టీడీపీ అయితే ఇప్పటికీ ప్రతిపక్షమేనని గుర్తు చేస్తున్నారు.