Begin typing your search above and press return to search.
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను అందుకే హత్య చేశారా?
By: Tupaki Desk | 6 March 2016 4:43 AM GMTసంచలనం సృష్టించిన సికింద్రాబాద్ ఐటీ ఉద్యోగి హత్య ఉదంతం ఒక కొలిక్కి వచ్చింది. ఐటీ ఉద్యోగి సంజయ్ జుంగేను పొద్దుపొద్దున్నే స్వప్నలోక్ కాంప్లెక్స్ దగ్గర హత్య చేసిన తీరు సంచలనం సృష్టించటం తెలిసిందే. ఈ వ్యవహారంపై దృష్టి సారించిన పోలీసులు.. నిందితుల్ని తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సంజయ్ ను హత్య చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్న విషయంపై దృష్టి సారించిన పోలీసులకు.. అసలు కారణం తెలిసి ఆశ్చర్యపోయే పరిస్థితి. పోలీసులే కాదు.. ఈ హత్యకు కారణం తెలిస్తే విస్మయం చెందాల్సిందే. సాయం చేసినోళ్లను చులకన చేస్తూ వ్యాఖ్యలు చేసి మరీ సంజయ్ ప్రాణాలు పోగొట్టుకున్నట్లుగా చెబుతున్నారు.
హత్యకు అసలు కారణం ఏమిటన్న విషయంపై పలు కోణాల్లో విచారణ జరిపిన పోలీసులకు తెలిసిన విషయాలు చూస్తే.. హత్య జరగటానికి కొద్ది గంటల ముందు తన ఫ్రెండ్స్ అయిన సిద్దాంత్.. కుశాల్కర్ లతో కలిసి సంజయ్ తెల్లవారుజాము వరకూ పూటుగా మద్యం సేవించాడు. అనంతరం ఈ ముగ్గురూ పంజాగుట్ట పీవీఆర్ మాల్ వద్దకు వచ్చారు. తాను అక్కడ నుంచి ఇంటికి వెళతానని సంజయ్ చెప్పటంతో.. అతడిని వదిలేసి ఫ్రెండ్ వెళ్లిపోయారు.
తాను సికింద్రాబాద్ వైపు వెళ్లాల్సిన నేపథ్యంలో.. పంజాగుట్టలో ఏపీ 14 క్యూ 8055 మారుతి స్విఫ్ట్ కారులో లిఫ్ట్ అడిగి సంజయ్ ఎక్కాడు. ఆ కారులో పాతబస్తీకి చెందిన ముభాషీన్.. సల్మాన్.. శ్రీధర్ బాబులు ఉన్నారు. బాబు డ్రైవింగ్ చేస్తుంటే.. కారులో ఉన్న ముబాషీన్ ఫోన్లో ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు. అతడి పక్కనే కూర్చున్న సంజయ్.. అతడ్ని ఆటపట్టించే ప్రయత్నం చేశాడు. ఇలా వీరి మధ్య మాటా మాటా పెరిగి బేగంపేట వద్దకు వచ్చిన సమయంలో సంజయ్ ను కారులో నుంచి దిగేయాలని కోరారు.
కారు దిగేందుకు నో చెప్పిన సంజయ్.. తన స్నేహితుడు పరేడ్ గ్రౌండ్ దగ్గర ఉన్నాడని.. అక్కడ దింపాలని కోరాడు. తాము ఎస్డీ రోడ్ లో వెళుతున్నట్లు కారులోని వారు చెప్పటంతో తన తండ్రి షాపు ప్యాట్నీ సెంటర్ లో ఉందని.. అక్కడ దింపాలని కోరాడు. కానీ.. వారు సంజయ్ ను స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్ద సంజయ్ ను దింపేశారు. దీంతో.. సంజయ్ వారిని తిట్టటం మొదలెట్టాడు. ఈ సమయంలోనే ముభాషీన్ తన దగ్గరున్న కత్తి తీసుకొని సంజయ్ గుండెల్లో పొడిచాడు. దీంతో.. సంజయ్ కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. కత్తిపోట్లు పొడిచిన ముభాషీన్ రౌడీషీటర్ కావటం గమనార్హం. తాజాగా ఈ ఘటనలో ఉన్న ముగ్గురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసిందే.