Begin typing your search above and press return to search.
‘‘స్మార్ట్’’ తప్పు కేసీఆర్ దా? కేంద్రానిదా?
By: Tupaki Desk | 29 Jan 2016 6:20 AM GMTగురువారం మధ్యాహ్న వేళ.. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని సుదీర్ఘంగా చెప్పేసిన ఆయన.. ప్రశాంతంగా కూర్చొని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రతి ప్రశ్నకు వివరంగా సమాధానాలు ఇస్తున్న వేళ.. ఒక మీడియా ప్రతినిధి ప్రధాని మోడీపై తెలంగాణ సర్కారు చేస్తున్న విమర్శలకు సంబంధించిన ఒక ప్రశ్న అడిగారు.
వెంటనే స్పందించిన ఆయన తన ఎదురుగా టేబుల్ మీదున్న కాగితాన్ని తీసుకొని.. ఇప్పుడే తనకు సమాచారం అందిందని.. స్మార్ట్ సిటీలను ప్రకటించారని.. 20 ప్రకటిస్తే ఆంధ్రాకి రెండు ఇచ్చారని.. తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదని.. ఇది చాలదా కేంద్రం తెలంగాణ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో అని చెప్పేశారు.
మీడియా సమావేశానికి హాజరైన జర్నలిస్టులలో చాలామందికి.. లైవ్ లో కేసీఆర్ మీడియా సమావేశాన్ని చూస్తున్న కోట్లాది మందికి కేసీఆర్ వాదనలో తప్పు లేదనిపించలేదు. నిజమే.. మోడీ ఎంత మోసం చేస్తున్నారు. తెలంగాణ పట్ల ఆయన వివక్షతో వ్యవహరిస్తున్నారన్న భావన కలిగే పరిస్థితి. మరి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆరోపణల్లో నిజం ఎంత? ఆయన చెప్పిన మాటల్లో వాస్తవం మాటేమిటి? అన్న ప్రశ్నలు వేసుకొని.. వాటిని వెతికే ప్రయత్నం చేస్తే కేసీఆర్ తాలూకు మేజిక్ ఇట్టే అర్థమవుతుంది.
కేంద్రం ప్రకటించిన స్మార్ట్ సిటీలలో ఏపీకి రెండు దక్కితే తమకు ఒక్కటి కూడా లేదన్న కేసీఆర్.. ఏపీ సర్కారు మొత్తం మూడు ప్రతిపాదనలు పంపిందని.. తాము మూడు పంపాల్సి ఉంటే.. పంపింది ఒక్కటేనని.. అది కూడా అరకొరగా పంపామన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించని వైనం కనిపిస్తుంది. నిజానికి స్మార్ట్ సిటీల్లో భాగంగా హైదరాబాద్.. వరంగల్.. కరీంనగర్ లను స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేయాలని కోరుతూ ప్రతిపాదనలు కేంద్రానికి పంపాల్సి ఉంది.
అయితే.. ఇప్పటికే మహానగరమైన హైదరాబాద్ ను స్మార్ట్ సిటీ కంటే కూడా స్మార్ట్ మెట్రోగా తీర్చిదిద్దితే బాగుంటుందన్న సూచన చేసిన కేసీఆర్.. స్మార్ట్ సిటీ లెక్కలో నుంచి హైదరాబాద్ ను తనకు తానే తీసేశారు. ఇక.. మిగిలింది వరంగల్.. కరీంనగర్ పట్టణాలు మాత్రమే. ఈ రెండింటికి సంబంధించి వరంగల్ కు సంబంధించిన ప్రతిపాదనల్ని మాత్రమే స్మార్ట్ సిటీ పోటీకి పంపారు. కరీంనగర్ పట్టణం స్మార్ట్ పోటీలో పాల్గొన్నదే లేదు.
దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పలు పట్టణాలు తమను స్మార్ట్ సిటీలుగా ప్రకటించాలంటూ తమ బిడ్లను పంపాల్సి ఉంటుంది. ఈ పోటీలో పేర్కొన్న విధంగా తమ ప్రతిపాదనల్ని పక్కాగా తయారు చేయాల్సి ఉంటుంది. అలా పంపిన వాటిని లెక్కలు తీసి.. వాటికి విభాగాల వారీగా మార్కులు వేస్తారు. ఇలా వేసిన తర్వాత అత్యుత్తమ మార్కులు వచ్చిన పట్టణాల్ని వరుస క్రమంలో టాప్ 20ని ఎంపిక చేసి ప్రకటిస్తారు.
ఇక.. తెలంగాణ రాష్ట్రం విషయంలో మూడు ప్రతిపాదనలు పంపాల్సి ఉంటే.. కేసీఆర్ సర్కారు పంపింది ఒక్క వరంగల్ పట్టణానికి సంబంధించిన ప్రతిపాదన మాత్రమే. ఈ ప్రతిపాదనకు లభించిన మార్కులు 54.79. స్మార్ట్ సిటీ ఎంపికకు కటాఫ్ మార్కులు 55గా నిర్ణయించారు. ఈ లెక్కన చూస్తే.. చాలా కొద్ది దూరంలో స్మార్ట్ సిటీగా ఎంపిక కాకుండా ఆగింది. వాస్తవం ఇలా ఉంటే.. తెలంగాణ పట్ల కేంద్రం ప్రదర్శించిన వివక్ష కారణంగానే తమకు అవకాశం దక్కలేదని బావురుమనటం ఎంతవరకు సబబు? రాజకీయం చేయొచ్చు కానీ.. వాస్తవాన్ని వక్రీకరించి చెప్పటం ఎంతవరకు సబబు అన్నదే పెద్ద ప్రశ్న. వాస్తవాలు తెలుసుకోకుండా కేవలం రాజకీయ నాయకుల మాటలు వింటే విషయం ఎలా అర్థమవుతుందనటానికి స్మార్ట్ సిటీ ఉదంతమే చక్కటి నిదర్శనం.