Begin typing your search above and press return to search.
ఆ ఇద్దరు బెంగాలీ నటీమణుల ఆత్మహత్య వెనుక కారణం ఇదేనా?
By: Tupaki Desk | 28 May 2022 2:42 AM GMTరోజుల వ్యవధిలో ఇద్దరు బెంగాలీ నటీమణులు ఆత్మహత్య చేసుకోవటం కలకలాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఆ మాటకు వస్తే ఒకరి తర్వాత ఒకరన్నట్లుగా సూసైడ్ లు షాకిచ్చాయి. అయితే.. ఈ ఇద్దరు నటీమణుల ఆత్మహత్యలకు వారి మధ్యనున్న 'స్నేహమే' కారణమైందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఈ సందేహాం నిజమే అన్నట్లుగా ఒక నటి తల్లి తాజాగా చేసిన వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఒక వ్యక్తితో రిలేషన్ తో ఉన్న నటి బిడిషా.. బ్రేకప్ కావటంతో తీవ్ర ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడినట్లుగా చెబుతున్నారు.
ఆమె ఆత్మహత్య చేసుకున్నంతనే మరో నటి మంజుషా సైతం సూసైడ్ చేసుకోవటం వెనుక వారిద్దరి మధ్య స్నేహమే దీనంతటికి కారణమని చెబుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్న ఈ జంట సూసైడ్ల మీద మంజుషా తల్లి మాట్లాడారు.
తన కుమార్తె మరణంపై ఆమె షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. బిడిషా అంటే మంజూషాకు అమితమైన ఇష్టమని.. ఎప్పుడూ ఆమె గురించే చెబుతుండేదని తెలిపారు. బిడిషాతో కలిసి బతకాలని మంజూ చాలాసార్లు తమతో చెప్పినట్లు చెప్పారు.
"ఈ విషయం మీద ఆమెకు ఎంతో నచ్చ చెప్పే ప్రయత్నం చేశాం. కానీ.. బిడిషాపై ఇష్టాన్ని మాత్రం వదులుకోలేకపోయింది" అంటూ మంజూషా తల్లి చేసిన వ్యాఖ్యల్ని చూసినప్పుడు.. ఇద్దరి మధ్యనున్న రిలేషన్ కు వ్యతిరేకత వ్యక్తం కావటంతోనే ఆమె సూసైడ్ కు పాల్పడినట్లుగా అర్థమవుతుంది.
ఇద్దరు నటీమణుల మధ్య 'స్నేహం' ఆమోదానికి ఇరు కుటుంబాల్లో ఒప్పుకోకపోవటంతోనే ఒత్తిడికి లోనై బిడిషా మరణిస్తే.. ఆమె లేని జీవితం తనకు అక్కర్లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తూ మంజూషా ఇంట్లో ఉరి వేసుకున్న వైనం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.