Begin typing your search above and press return to search.

శ్రీ‌దేవి రాక ఎందుకు ఆల‌స్య‌మ‌వుతుందంటే?

By:  Tupaki Desk   |   26 Feb 2018 4:25 AM GMT
శ్రీ‌దేవి రాక ఎందుకు ఆల‌స్య‌మ‌వుతుందంటే?
X
శ్రీ‌దేవి మ‌రణం దేశ ప్ర‌జ‌ల‌కు షాకింగ్ గా మారిన సంగ‌తి తెలిసిందే. దుబాయ్ లో మ‌ర‌ణించిన ఆమెను తీసుకురావ‌టానికి గంట‌లు గ‌డుస్తున్నా.. అదిగో .. ఇదిగో అంటూ రోజుకు పైనే గ‌డిచిపోవ‌టంపై ఆందోళ‌నతో పాటు ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. శ్రీ‌దేవి లాంటి ప్ర‌ముఖవ్య‌క్తి మ‌ర‌ణిస్తే.. ప్రొసీజ‌ర్ పేరుతో గంట‌ల కొద్దీ టైం గ‌డిపేయ‌టం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

దుబాయ్ చ‌ట్టాలు చాలా క‌ఠిన‌మ‌ని.. సామాన్యులైనా.. సెల‌బ్రిటీల‌కైనా ఒకే విధంగా చ‌ట్టం వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని చెబుతున్న‌ప్ప‌టికీ.. శ్రీ‌దేవి బ్ల‌డ్ శాంపిల్స్ కు సంబంధించిన రిపోర్ట్ తో పాటు.. వైద్యులు ఇవ్వాల్సిన రిపోర్ట్ ఆల‌స్యం కావ‌టాన్ని త‌ప్పు ప‌డుతున్నారు.

ఫోరెన్సిక్ రిపోర్ట్ విష‌యానికే వ‌స్తే.. ఈ ఉద‌యం దుబాయ్ టైమింగ్స్ ప్ర‌కారం మ‌ధ్యాహ్నం ప‌న్నెండు గంట‌ల‌కు ఇవ్వొచ్చ‌ని చెప్పినా.. ఇప్ప‌టివ‌ర‌కూ అలాంటిదేమీ చోటు చేసుకోలేదు. శ్రీ‌దేవి మ‌ర‌ణ‌వార్త విని.. ఆమె అభిమానులు ఫోరెన్సిక్ కార్యాల‌యానికి వ‌ద్ద‌కు చేరుకుంటున్నారు.

దుబాయ్ లోని భార‌త దౌత్య కార్యాల‌యంలోని విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం దుబాయ్ టైమింగ్ ప్ర‌కారం మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల స‌మ‌యంలో అన్ని ప్రొసీజ‌ర్లే పూర్తి అవుతాయ‌ని.. భార‌త కాల‌మానం ప్ర‌కారం ఈ సాయంత్రం 5 గంట‌ల‌కు శ్రీ‌దేవి ముంబ‌యికి చేరుకుంటార‌ని చెబుతున్నారు. ఈ విష‌యాన్ని దుబాయ్ కు చెందిన ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ వెల్ల‌డించింది.