Begin typing your search above and press return to search.

నిశ్శబ్ద సునామీ వెనుక సీక్రెట్ ఇదేన‌ట‌!

By:  Tupaki Desk   |   25 Dec 2018 5:02 AM GMT
నిశ్శబ్ద సునామీ వెనుక సీక్రెట్ ఇదేన‌ట‌!
X
అత్యాధునిక సాంకేతిక‌త అందుబాటులో ఉన్న వేళ‌.. సునామీ రావ‌టానికి కొన్ని గంట‌ల ముందే హెచ్చ‌రించే వ్య‌వ‌స్థ అందుబాటులో ఉంది.అయిన‌ప్ప‌టికీ ఇండోనేషియాలో ఇటీవ‌ల విరుచుకుప‌డిన నిశ్శ‌బ్ద సునామీ కార‌ణంగా దాదాపు 380 మంది వ‌ర‌కూ మృత్యువాత ప‌డ్డారు. టెక్నాల‌జీ ఇంత‌గా పెరిగిపోయిన రోజుల్లోనూ సునామీ దెబ్బ‌కు చోటు చేసుకున్న విల‌యంపై విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. ఉలుకు ప‌లుకు లేకుండా ఉత్త పుణ్యంగా విరుచుకుప‌డిన సునామీ కార‌ణంగానే ఇంత భారీ న‌ష్టం వాటిల్లింది. ఇంత‌కీ.. ఇండోనేషియాలో తాజాగా చోటు చేసుకున్న ప్ర‌కృతి విల‌యాన్ని అత్యాధునిక సాంకేతిక‌త ఎందుకు ముందుగానే ప‌సిగ‌ట్ట‌లేక‌పోయింది? లోపం ఎక్క‌డ చోటు చేసుకుంది? ఇంత‌మంది ప్రాణాల‌తో పాటు.. భారీ ఆస్తిన‌ష్టం ఎందుకు వాటిల్లింద‌న్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇండోనేషియాలో చోటు చేసుకున్న నిశ్శ‌బ్ద సునామీకి సంబంధించి కీల‌క విష‌యాల్ని భూకంప అధ్య‌య‌న శాస్త్ర‌వేత్త శ్యామ్ టేల‌ర్ త‌న వాద‌న‌ను వినిపిస్తున్నారు. వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ట్లుగా చెబుతున్న ఈ వాద‌న‌లోని కీల‌క అంశాల్ని చూస్తే.. ప్ర‌కృతి ముందు మ‌నిషి ఎంత అల్ప‌మైనోడో ఇట్టే అర్థం కావ‌టం ఖాయం. అంతేనా.. రానున్న రోజుల్లో మ‌రో మ‌హా వినాశ‌నం త‌ప్ప‌ద‌న్న హెచ్చ‌రిక భ‌యానికి గురి చేయ‌క మాన‌దు. ఇంత‌కీ.. ఇండోనేషియాలో విరుచుకుప‌డిన నిశ్శ‌బ్ద సునామీ గుట్టు ఏమిట‌న్న‌ది చూస్తే..

+ జావా.. సుమ‌త్రా దీవుల మ‌ధ్య‌న ఉన్న అన‌క్ క్ర‌క‌టోవా అగ్ని ప‌ర్వ‌తం గ‌డిచిన కొద్ది నెల‌లుగా లావాను విర‌జిమ్ముతోంది. నిశ్శ‌బ్ద సునామీకి విరుచుకుప‌డ‌టానికి కేవ‌లం 24 నిమిషాల ముందు అగ్నిప‌ర్వ‌తంలోని ఒక భాగం (కొండ‌చ‌రియ‌) అక‌స్మాత్తుగా కుప్ప‌కూలింది. వాయు వేగంతో జ‌రిగిన ఈ ప‌రిణామం కార‌ణంగా నీరు స్థాన‌భ్రంశం చెంది త‌రంగాలుగా నిట్ట‌నిలువుగా పైకి విర‌జిమ్మాయి. దీంతో రాకాసి అల‌లు నిశ్శ‌బ్దంగా తీరంవైపు విరుచుకుప‌డ్డాయి.

+ ఇంత భారీ ఎత్తున అల‌లు దూసుకురావ‌టం.. వాయు వేగంతో జ‌రిగిన ఈ ప‌రిణామాన్ని ప్ర‌కృతి విప‌త్తు నివార‌ణ వ్య‌వ‌స్థ‌లు గుర్తించే లోపే జ‌ర‌గాల్సిన న‌ష్టం భారీగా జ‌రిగిపోయింది. మ‌రో కీల‌కాంశం ఏమంటే.. అన‌క్ క్ర‌కటోవా అగ్నిప‌ర్వ‌తం గ‌డిచిన కొన్ని నెల‌లుగా లావాను విర‌జిమ్ముతోంది.

+ఒక్క‌సారిగా అగ్నిప‌ర్వ‌తంలోని ఒక భారీ కొండ‌చ‌రియ స‌ముద్రంలో కుప్ప‌కూలాయి. అగ్నిప‌ర్వ‌తంలోని ఒక భాగం కుప్ప‌కూల‌టంతో అగ్నిప‌ర్వ‌తం పైక‌ప్పు కుప్ప‌కూల‌టంతో భారీ విస్పోటం చోటు చేసుకుంది. భారీ శ‌క‌లం స‌ముద్రంలోకి కుప్ప‌కూల‌టంతో నీరు కొన్ని వంద‌ల మీట‌ర్లు పైకి ఎగ‌జిమ్మాయి. అగ్నిప‌ర్వ‌తంలోని సింహ‌భాగం కుప్ప‌కూల‌టంతోనే రాకాసి అల‌లు చోటు చేసుకోవ‌టానికి కార‌ణంగా భావిస్తున్నారు.

+ ఇండోనేషియాలో చోటు చేసుకున్న నిశ్శ‌బ్ద సునామీకి ముందు భూకంపం చోటు చేసుకుంద‌న్న విష‌యాన్ని జ‌ర్మ‌న్ రీసెర్చ్ సెంట‌ర్ ఫ‌ర్ జియో సైన్సెస్ వెల్ల‌డించింది. అగ్నిప‌ర్వ‌తానికి 25 కిలోమీట‌ర్ల ప‌రిధిలో భూకంపం చోటు చేసుకుంద‌ని.. ఆ ప్ర‌భావంతోనే అగ్నిప‌ర్వ‌తంలోని శిఖరం కూలిపోవ‌టానికి కార‌ణంగా భావిస్తున్నారు.

+ మ‌రింత జ‌రుగుతున్నా ఎవ‌రూ ఎందుకు ప‌ట్టించుకోలేదు? ఏ వ్య‌వ‌స్థ ఈ విష‌యాన్ని ముందుగా ప‌సిగ‌ట్ట‌లేద‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. దీనికి వ‌స్తున్న స‌మాధానం ఏమంటే.. అన‌క్ క్ర‌క‌టోవా అగ్నిప‌ర్వ‌తం నిరంత‌రం చ‌ప్పుళ్లు చేస్తుండ‌టంతో పెద్ద ఎత్తున శ‌బ్ద కాలుష్యం నెల‌కొంది. ఈ శ‌బ్దాలు రోటీన్ గా మారటంతో ఎవ‌రికి ప‌ట్ట‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

+ కొంద‌రు చెబుతున్న‌ట్లు భూకంపం చోటు చేసుకోలేద‌ని.. అగ్నిప‌ర్వ‌తంలోని ఒక కొండ చ‌రియ కూలిపోవ‌టంతో చోటు చేసుకున్న భారీ ఒత్తిడితోనే నిశ్శ‌బ్ద సునామీ చోటు చేసుకున్న‌ట్లు చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే సునామీ సంకేతాల్ని రికార్డు కాలేద‌ని చెబుతున్నారు.

+ నిశ్శ‌బ్ద సునామీకి ముందు భూమి కంపించ‌టం.. సుముద్రం ఉప్పొంగ‌టం లాంటివి చోటు చేసుకోలేద‌ని.. దీంతో హెచ్చ‌రిక‌లు చేసే వ్య‌వ‌స్థ‌లు ఈ ఉప‌ద్ర‌వాన్ని ముందుగా ప‌సిగ‌ట్ట‌లేక‌పోయాయి. అగ్నిప‌ర్వ‌తం విరిగి ప‌డిన 24 నిమిషాల‌కు రాకాసి అల‌లు ఏర్ప‌డి.. 10 మీట‌ర్ల ఎత్తుతో వాయు వేగంతో తీరాన్ని తాకాయి. దీంతో.. భారీ న‌ష్టం వాటిల్లింది.

+ అగ్నిప‌ర్వ‌తాల కార‌ణంగా సునామీలు ఏర్ప‌డ‌టం చాలా అరుదుగా చోటు చేసుకునే ప‌రిణామం. ఇది కూడా ముంచుకొస్తున్న ప్ర‌మాదాన్ని ప‌సిగ‌ట్ట‌టంతో విఫ‌ల‌మ‌య్యేలా చేసింది.క్ర‌కోవాలో అగ్నిప‌ర్వ‌తం ఇంకా యాక్టివ్ గా ఉండ‌టం.. మ‌రో నెల నుంచి ఏడాది లోపు మ‌రో శిఖ‌రం విరిగిప‌డే ప్ర‌మాదం ఉంద‌ని.. అదే జ‌రిగితే మ‌రో భీక‌ర ప్ర‌ళ‌యం చోటు చేసుకుంటుంద‌న్న అభిప్రాయాన్ని శాస్త్ర‌వేత్తలు చెబుతున్నారు. శ‌నివారం చోటు చేసుకున్న ఈ దారుణ విప‌త్తులో ఇప్ప‌టివ‌ర‌కూ మృతి చెందిన వారి సంఖ్య అధికారికంగా 373కు చేరుకుంది. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఈ ఉదంతంలో 1459 మంది గాయ‌ప‌డిన‌ట్లుగా రికార్డులు చెబుతున్నాయి.