Begin typing your search above and press return to search.

అమెరికా అస‌లెందుకు కుప్ప‌కూలిందంటే...

By:  Tupaki Desk   |   20 Jan 2018 8:07 AM GMT
అమెరికా అస‌లెందుకు కుప్ప‌కూలిందంటే...
X
అగ్ర‌రాజ్యం అమెరికాలో నెల‌కొన్న ప‌రిణామం క‌ల‌కలం రేకెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే . ద్రవ్య వినిమయ బిల్లుకు అమెరికా సేనేట్‌ లో ఆమోదం దక్కలేదు. దీంతో ట్రంప్ ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించాయి. అయితే ఎందుకీ స‌మ‌స్య ఉత్పన్నమైంది అనేది అంద‌రిలోనూ ఆస‌క్తి రేకెత్తిస్తున్న అంశం. వివిధ వ‌ర్గాలు..ఈ ప‌రిణామానికి ట్రంప్ నిర్ణయాల వల్లే అని తెలుస్తోంది.

ప్రస్తుతం అమెరికాలో సుమారు ఏడు లక్షల మంది అక్రమ వలసదారులు ఉన్నారు. వాళ్లనే డ్రీమర్స్ అని పిలుస్తున్నారు. మాజీ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో వాళ్లకు పాక్షికంగా లీగల్ స్టేటస్ కల్పించారు. వాళ్లను తరిమేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం గత సెప్టెంబర్‌ లో ట్రంప్ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. డ్రీమర్స్‌ ను దేశం నుంచి తరిమేయాలని భావించింది. కానీ డెమోక్రాట్లు మాత్రం ఆ వలసదారుల్ని కాపాడాలనుకుంటున్నారు. ఈ అంశంపైనే డెమోక్రాట్లు - రిపబ్లికన్ల మధ్య చిచ్చు మొదలైంది. పటిష్టమైన సరిహద్దులను నిర్మించాలని ట్రంప్ ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో తన పథకానికి భారీగా నిధులు కేటాయించారు. కానీ డెమోక్రాట్లు మాత్రం డ్రీమర్స్ గురించి పోరాటం చేస్తున్నారు. వలసదారుల్ని రక్షించుకోవాలని చూస్తున్నారు. ఇదే అంశంపై ఇటీవల ట్రంప్ కూడా ఆగ్రహానికి గురయ్యారు. కొన్ని చెత్త దేశాల నుంచి వలసదారుల్ని ప్రోత్సహిస్తున్నారని ఆవేశానికి లోనయ్యారు. ఇక్క‌డే పేచీ వ‌చ్చిప‌డింది.

వినమయ బిల్లు ఆగిపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలకు నిధులు నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయాల్సి వస్తుంది. కాంగ్రెస్(సేనేట్ - హౌజ్ ఆఫ్ కామన్స్) - వైట్‌ హౌజ్‌ లో ట్రంప్ ప్రభుత్వం కంట్రోల్‌ లో ఉన్నా.. షట్‌ డౌన్ లాంటి పరిస్థితిని ట్రంప్ ప్రభుత్వం ఎదుర్కొవడం దారుణమే. డెమోక్రటిక్ సేనేటర్లు ఉన్న రాష్ర్టాల్లో .. ట్రంప్ నిర్ణయాలు మరింత కఠినమైన పరిస్థితుల్ని తీసుకువచ్చే అవకాశాలున్నాయి. ఈ ఏడాది నవంబర్‌ లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లకు షట్‌ డౌన్ అంశం శరాఘాతంగా మారే ఛాన్సుంది. అమెరికా ప్రభుత్వం మూసివేతపై రక్షణ మంత్రి జిమ్ మాటిస్ స్పందించారు. కేవలం 50 శాతం మాత్రమే శాఖాపరమైన వ్యవహారాలు కొనసాగుతాయన్నారు. మెయింటెనెన్స్ - ట్రైనింగ్ - ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ నిలిచిపోనున్నాయి. ఒకవేళ డెమోక్రాట్లతో డీల్ కుదరకపోతే, ప్రభుత్వాన్ని నడిపేందుకు ట్రంప్ భిన్న ఎత్తుగడలు వేసే అవకాశం ఉంది. వీసా - పాస్‌ పోర్ట్ ప్రాసెసింగ్ కూడా జాప్యం జరిగే ఛాన్సుందని నిపుణులు చెప్తున్నారు.