Begin typing your search above and press return to search.

అజ్ఞాతంలో రాములమ్మ.. కారణమిదే..

By:  Tupaki Desk   |   9 Sep 2018 11:36 AM GMT
అజ్ఞాతంలో రాములమ్మ.. కారణమిదే..
X
రాములమ్మ అజ్ఞాతం వీడడం లేదు.. 2014 ఎన్నికల్లో టీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి మెదక్ శాసనసభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయాక సైలెంట్ అయ్యారు. యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. ఓటమి నైరాష్యం తెచ్చిందో లేక.. ఏమైందో కానీ రాములమ్మ మాత్రం పొలిటికల్ స్క్రీన్ పై కనుమరుగైంది. చాలా రోజుల తర్వాత ఇటీవల బోనాల పండుగకు తిరిగొచ్చింది. హైదరాబాద్ లోని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. ఇక రాములమ్మ మళ్లీ కాంగ్రెస్ లో చురుకుగా మారుతుందని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది.. రాములమ్మ మళ్లీ అజ్జాతంలోకే వెళ్లిపోయింది. ఇటీవలే రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలోనూ కనిపించకపోవడం కాంగ్రెస్ శ్రేణులను నివ్వెరపరిచింది.

తెలంగాణలో ఇప్పుడు రాజకీయ వేడి రాజుకుంది. కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. తెలంగాణ ఇచ్చి కూడా అధికారంలోకి రాని కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని ప్లాన్ చేసింది. ఈ ఎన్నికలను చావోరేవోగా భావిస్తోంది. ఇంతటి క్లిటికల్ పొజిషన్ లో కూడా రాములమ్మా కాంగ్రెస్ కు చేదోడువాదోడుగా ఉండకుండా పంతాలకు పోయి దూరంగా ఉండడం కాంగ్రెస్ శ్రేణులను నివ్వెరపరుస్తోంది.

విజయశాంతి కాంగ్రెస్ లో యాక్టివ్ రోల్ పోషించకపోవడానికి ప్రధాన కారణం.. ఆమెను కాంగ్రెస్ గుర్తించడం లేదనే అనుమానేనట.. కాంగ్రెస్ లో చేరాక విజయశాంతికి ఏ పార్టీ పదవి లభించలేదు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి కావాలని విజయశాంతి కోరినా కాంగ్రెస్ అధిష్టానం పెడచెవిన పెట్టిందట.. అంతేకాదు.. పీసీసీ తెలంగాణ కమిటీలో కూడా ఏ పదవి ఇవ్వలేదట.. దీంతో అలకబూనిన రాములమ్మా కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగారు.

ముందస్తు ఎన్నికలు వచ్చేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలంతా యాక్టివ్ మారి దూసుకుపోతున్నారు. ఇప్పుడు కూడా పార్టీలు, పదవులు అంటూ విజయశాంతి గొంతెమ్మ కోర్కెలు కోరడంపై కాంగ్రెస్ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చాక అడిగితే బాగుంటుందని.. ఇప్పుడే పదవి లేదని పార్టీని పట్టించుకోకపోవడం ఏంటని వారు నిలదీస్తున్నారు.

అయితే విజయశాంతి వెర్షన్ మరోలా ఉంది. దక్షిణ భారతదేశం మొత్తం ప్రభావితం చేసే సినీ గ్లామర్ తనది అని అలాంటి తనను కాంగ్రెస్ లో పట్టించుకోవడం లేదన్నది ఆమె వాదన.. కానీ సత్తా చూపించాల్సిన టైంలో విజయశాంతి పదవుల కోసం.. పాపులారిటీ కోసం పాకులాడడంపై కాంగ్రెస్ నేతలు , కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు. ఇలా రాములమ్మ అలక తీర్చడానికి, ఆమె కోర్కెలు వినడానికి కాంగ్రెస్ సీనియర్లు ముందుకు రాకపోవడంతో ఆమె సైలెంట్ అయ్యారు.