Begin typing your search above and press return to search.
అమ్మ ఎస్టేట్ వాచ్ మన్ హత్యలోఎన్నో ట్విస్ట్‌లు
By: Tupaki Desk | 25 April 2017 11:11 AM GMTతమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడ్ ఎస్టేట్‌లో వాచ్ మెన్ హత్యకు గురయిన విషయంలో కొత్త వార్తలు తెరమీదకు వస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఉదంతంలో కారులో వచ్చిన దుండగులు ఎస్టేట్ కు కాపలా ఉన్న ఇద్దరు వాచ్ మెన్లపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. దుండగుల దాడిలో ఒక వాచ్ మెన్ మృతి చెందగా మరో వాచ్ మెన్ కు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఆశ్చర్యపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఆరు బృందాలుగా ఏర్పడ్డ పోలీసులు చేపట్టిన దర్యాప్తులో జయలలిత - శశికళ గదుల తాళాలు పగలగొట్టి రెండు సూట్ కేస్ లతో పాటు విలువైన పత్రాలు చోరీ చేశారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. సోమవారం వేకువ జామున సెక్యూరిటీ గార్డును హత్య చేసిన నిందితులు కొడనాడు ఎస్టేట్ లోని బంగ్లాలో జయలలిత, శశికళకు ప్రతేక గదుల్లో ఈ మేరకు చోరీ చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే జయలలిత కొడనాడు ఎస్టేట్ బంగ్లా దగ్గర ఏర్పాటు చేసిన సీసీకెమెరాలను పరిశీలించిన పోలీసు అధికారులు ఆధారాలు సేకరించారు. రెండుడు బోలెరో జీపులు కొనడాడు ఎస్టేట్ లోకి వెళ్లి వచ్చాయని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆరెండు జీపులు ఎవరివి ? ఆ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఎక్కడ చేశారు ? అంటూ పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా, గాయపడి చికిత్స పొందుతున్న మరో వాచ్‌మన్ దగ్గరి నుంచి వివరాలు రాబట్టనున్నట్లు సమాచారం.
కాగా, ఊటీలోని కొడనాడ్ ఎస్టేట్ సుమారు 900 ఎకరాలు ఉంటుంది. ప్రభుత్వ ధర ప్రకారం విలువ రెండు వందల కోట్లు అయినప్పటికీ మార్కెట్ విలువ దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ ఎస్టేట్ లో ఎక్కువగా తేయాకు తోటలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న భారీ బంగ్లాలో జయ అప్పుడప్పుడు రెస్ట్ తీసుకునేవారు. జయ ఆస్తుల పత్రాలే లక్ష్యంగా ఇటీవల వరుసగా జరుగుతున్న సంఘటనల్లో ఇది తాజా ఘటన ఇది. కొద్ది రోజుల కిందట చెన్నై శివార్లలోని జయలలితకు చెందిన భవంతికి నిప్పుపెట్టి డాక్యమెుంట్లను దగ్ధం చేసిన సంగతి తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/