Begin typing your search above and press return to search.

సంసారాలు చిన్నాభిన్నం.. కారణమిదే

By:  Tupaki Desk   |   1 Aug 2019 1:30 AM GMT
సంసారాలు చిన్నాభిన్నం.. కారణమిదే
X
మన తాతాల కాలం నాటి ముచ్చట.. అప్పట్లో మగాడు పనిచేసేవాడు. ఆడవాళ్లు ఇంట్లో ఉండి కుటుంబ బాధ్యతలు చూసుకునేవారు. భర్తను భార్య-భార్యను భర్త అంతే గౌరవంగా చూసుకునేవారు. సంసార బండిని సామరస్యంగా నడిపించేవారు. అరమరికలను తాతలు, నానమ్మలు తీరుస్తూ కాపురాలను నిలబెట్టేవారు. వ్యవసాయ పనుల్లో భార్యలు కూడా తలో చేయి వేచి దాంపత్యనావను బాగా నడిపించేవారు..

కానీ ఇప్పుడు కాలం మారింది. పోకడలు మారాయి.. మనసుల మధ్య ఓపిక- బంధుత్వాలు- ప్రేమలు తగ్గిపోయాయి. మగాడే కాదు.. భార్య కూడా పనిచేస్తుంది. ఇక్కడే వస్తుంది అసలు తంటా.. ఇద్దరు ఉద్యోగులైతే ఆ సంసారం చట్టబండలు అవుతోంది. నేనేం తక్కువ అని మహిళలు అంటున్నారు. ఇక్కడే ‘ఇగో’ రంగ ప్రవేశం చేసి కాపురాలు కూలిపోతున్నాయి.

సంపాదన మోజులో పడి ప్రేమలు, ఆప్యాయతలకు నేటి యువత దూరమైపోతున్నారు. ఇరువురు ఉద్యోగులతై వారి మధ్య దూరం పెరిగిపోతోంది. కనీసం కూర్చొని మాట్లాడుకునే పరిస్థితులు ఉండడం లేదు. పలకరింపు లేక వాట్సాప్ లో, ఫోన్లోనే హాయ్ బాయ్ లు పనులు చేసుకుంటున్నారు.

సమాజం, ఎలా బతకడం.. కట్టుబాట్ల గురించి చెప్పడానికి ఇప్పుడు ఎవ్వరి ఇంట్లో నానమ్మలు, అమ్మమ్మలు ఉండడం లేదు. బతుకు దెరువు కోసం నగరాలకు వెళ్లిపోతుండడంతో చిన్న చిన్న కుటుంబాలు ఏర్పడుతున్నాయి. తల్లిదండ్రులు సంపాదించడంతో పిల్లలు జల్సాలకు అలవాటు పడుతున్నారు. పెళ్లి అయినాక కూడా వీరు అలానే ఉండడం.. భాగస్వామి ఆదిపత్యాన్ని సహించక కాపురాలు కూల్చుకుంటున్నారు.

ఇక లవ్ - అరేంజెడ్ మ్యారేజిస్ లోనూ ఒంటరిగా దూరంగా బతుకుతున్న జంటలు అప్పటివరకు బాగా బతికి పెళ్లి అయ్యాక కష్టాలు భరించలేక నీ వల్లే ఈ దుస్థితి అంటూ గొడవలు పెట్టుకొని విడిపోతున్నారు. ఈ కేసులు ఎక్కువ అవుతున్నాయని లాయర్లు చెబుతున్నారు. అప్పటిదాకా బాగా బతికి కొత్తగా పెళ్లై కోరుకున్న జీవితం దక్కలేదని కొత్త కాపురాన్ని కాలదన్నుతున్నారని సర్వేలో తేలింది. ఆస్తులు పోగొట్టుకున్న కుటుంబాల్లో కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల విడిపోతున్న జంటలు ఎన్నో ఉంటున్నాయి.

ప్రధానంగా ఇద్దరు పనిచేయడం వల్లే ఇగోలు ఎక్కువై విడిపోతున్నారు. భార్య ఒక చోట,, భర్త మరోచోట ఉన్న కేసుల్లో కూడా విడిపోతున్నారు... ఇద్దరు ఉద్యోగులైతే ఇంటి గురించి, పిల్లలను పట్టించుకునే వారు లేక సంపాదన తెచ్చిన ఇగోతో కాపురాలను కూల్చుకుంటున్న వారి సంఖ్య బాగా పెరిగిపోతోందని సర్వేలో తేలింది. ఆలుమగల మధ్య అరమరికలను పరిష్కరించే వాళ్లు లేక.. సొంతంగా ఓపిక లేని వాళ్లు ఈ మధ్య కాలంలో ఎక్కువగా విడాకులకు వస్తున్న సైకాలజిస్టులు చెబుతున్నారు. సో కాపురాలు కూలడానికి ఇలా ఇగోలు, ఉద్యోగాలు, ఆధిపత్య ధోరణి, మాటలంటే పడే ఓపిక లేని తనం ఇలా చాలా కారణాలు కారణమవుతున్నాయి. ఆధునిక యువత దేన్నీ టేకిటీజీగా తీసుకోకపోవడంతో కాపురాలు గాలిలో దీపంగా మారుతున్నాయి.