Begin typing your search above and press return to search.
షర్మిలను వైఎస్ ఆర్ ఆత్మీయులు ఎందుకు కలవడం లేదు తెలుసా?
By: Tupaki Desk | 18 March 2021 2:58 PM GMTఎన్నో ఆశలు.. ఆశయాలతో తెలంగాణలో ముందడుగు వేయాలనుకుంటున్న షర్మిలను ఇక్కడి నేతలు ఎందుకు పట్టించుకోవడం లేదు. ఎందుకు ఒక్క పెద్ద నాయకుడు కూడా షర్మిల వైపు కన్నెత్తి చూడడం లేదు. ఆమె పార్టీలో చేరడం లేదు. ఫ్యాన్స్ పోటెత్తుతున్నా నేతలు ఎందుకు లోటస్ పాండ్ వైపు కన్నెత్తి చూడకపోవడం ఏంటన్న బాధ షర్మిల అభిమానుల్లో కనిపిస్తోందట..
తెలంగాణలో సీఎం కావాలని తపనపడుతున్న షర్మిల ఇప్పుడు ఆ దిశగా చర్యలు చేపడుతోంది. ఏపీలో అన్న వైఎస్ జగన్ సీఎం కావాలని నాడు రాష్ట్రమంతా తిరిగింది. నాడు ‘బైబై బాబు.. బైబై పప్పు’ అనే నినాదంతో ఆంధ్రా అంతా తిరిగింది. ఇప్పుడు తెలంగాణ కోడలు అని చెప్పి వైఎస్ఆర్ తో అనుబంధం ఉన్న అందరితో కలిసి పార్టీని ఏర్పాటు చేస్తానని షర్మిల హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వరుస మీటింగ్ లు పెడుతోంది.
కానీ తెలంగాణలో ఆమె పార్టీకి స్పందన కరువు అవుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇంతవరకు ఒక్క మాజీ ఎమ్మెల్యే కూడా షర్మిలను కలవలేదు. కనీసం ఔట్ డేటెడ్ కాంగ్రెస్ నేతలు కూడా షర్మిల వైపు తొంగిచూడలేదు. మాజీ ఎమ్మెల్యేలకు పార్టీలోకి రావాలని ఆమె ఆఫీస్ నుంచి ఫోన్లు వెళుతున్నా.. మొహమాటం మీద కలుస్తాం అంటున్నారే తప్పా ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్కరు కూడా కలవలేదు.
తెలంగాణ మీద పూర్తి స్థాయిలో అవగాహన లేకనా.. లేక ఆమె మీద పూర్తిస్థాయి నమ్మకం లేకనా అనేది తెలియదు కానీ మొత్తానికి ఏదో అధికార పార్టీ టీఆర్ఎస్ ను కొంచెం టార్గెట్ చేస్తోందని అంటున్నారు..కానీ టీఆర్ఎస్ మాత్రం షర్మిలను పెద్దగా పట్టించుకోవడం లేదు.
అసలు బీజేపీ వాళ్లు అయితే ఆమెను లెక్కలోకి కూడా తీసుకోవడం లేదని అంటున్నారు.. మొదట్లో కొంచెం కాంగ్రెస్ వాళ్లు, రేవంత్ రెడ్డి షర్మిలను టార్గెట్ చేశారు కానీ.. ఇప్పుడు వాళ్లు కూడా ఆమెను సీరియస్ గా తీసుకోవడం లేదట..
షర్మిల పార్టీ ఫెయిల్యూర్ పార్టీ అని పాత కాంగ్రెస్ ను తీసుకున్నట్టు ఉందని కాంగ్రెస్ వాదులు అంటున్నారు. చూద్దాం మరీ షర్మిల సక్సెస్ అవుతుందో లేదో..