Begin typing your search above and press return to search.

భట్టి....పదవికి ఆ వర్గమే కీలకం

By:  Tupaki Desk   |   19 Jan 2019 5:44 AM GMT
భట్టి....పదవికి ఆ వర్గమే కీలకం
X
భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త స్దాయి నుంచి శాసన సభ పక్షనేతగా ఎదిగిన నాయకుడు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అయిన నిబద్దతో పని చేసిన నాయకుడు. కాంగ్రెస్ పార్టీ ఎంత కష్టాలలో ఉన్నా పార్టీని వీడని వ్యక్తత్వం ఉన్న నాయకుడు. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి తెలుగు రాష్ట్రాలలో నమ్మదగిన నాయకుడు. ఇవన్నీ కాంగ్రెస శాసన సభా పక్ష నేతగా భట్టి విక్రమార్కను నియమించడానికి ప్రధాన కారణాలు. అయితే వీటి వెనుక మరో బలమైన కారణం కూడా తోడవడంతో భట్టి విక్రమార్కను సీఎల్‌ పీ పదవి వరించిందంటున్నారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు రెడ్లు - దళితులు. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డాకా రెడ్లు కాంగ్రెస్‌ కు దూరం అయ్యారు. అలాగే దళిత ఓటు బ్యాంకు కూడా చీలిపోయింది. వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ లో చాలా బలంగా ఉంది. రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో కలసి పోటీ చేసిన రెడ్డి కులస్థుల నుంచి మద్దతు రాదని కాంగ్రెస్ అధిష్టానం అంచనాకు వచ్చింది. దీంతో కనీసం దళిత ఓటు బ్యాంకును కాపాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది.

సీఎల్‌ పీ నాయకుడిగా ఎన్నికైన భట్టి విక్రమార్కకు ఆంధ్రప్రేదేశ్‌ లో తనదైన అనుచరగణం ఉంది. ముఖ్యంగా ఉభయాగోదావరి జిల్లాలతో పాటు - ఉత్తరాంధ్ర జిల్లాలలో భట్టి వర్గీయులు ఉన్నారు. భట్టి విక్రమార్క తాను ఏ పని చేయాలన్న కోనసీమలోని అమలాపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శంచుకుని ఆ పని చేస్తారు. భట్టి విక్రమార్కకు సీఎల్‌ పీ నాయకుడిగా పదవి ఇస్తే ఆంధ్ర్రప్రదేశ్‌ లో తమకు దూరమైన దళితులు చేరువౌతారని - కొప్పుల రాజు - శీలం వంటి దళిత నాయకులు రాహుల్ గాంధీకి వివరించినట్లు సమాచారం. అలాగే తెలంగాణ సీఎల్‌ పీ పదవిని అగ్ర కులస్థుడికి కాక దళితులికి ఇస్తే సామాజిక న్యాయం పాటించినట్టు ఉంటుందని కూడా రాహుల్ గాంధీకి వివరించినట్లు చెబుతున్నారు. సీఎల్‌ పీ నాయకుడి పదవికి అగ్రవర్ణాల నుంచి ఎక్కువ మంది పోటీ పడ్డారు. దళిత నేతల నుంచి మాత్రం పెద్దగా పోటీ ఎదురు కాలేదు. దీంతో రాహుల్ గాంధీ మధ్యే మార్గంగా భట్టి విక్రమార్కను ఎంపిక చేసినట్లు చెబుతున్నారు.