Begin typing your search above and press return to search.
ఈశాన్య రాష్ట్రాలకే ఎక్కువ పతకాలకు కారణం ఇదేనట!
By: Tupaki Desk | 23 Aug 2021 8:34 AM GMTమొన్న జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ ప్రపంచ వ్యాప్తంగా ఎంత గుర్తింపు పొందిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ ఆటల్లో మన భారతదేశం కూడా గతం కంటే కొంచెం మెరుగ్గానే రాణించి ఎక్కువ పతకాలు కూడా సాధించింది. ఈ సారి గతంలో కంటే ఎక్కువగానే మన దేశం నుంచి దాదాపుగా 127 మంది క్రీడాకారులు ఒలింపిక్స్‌లో తమ సత్తా చాటేందుకు దేశం నుంచి వెళ్లారు. కాగా అందులో 8 మంది ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారు కావడం గమనార్హం. ఇంకా చెప్పాలంటే ఈ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారే మన దేశానికి ఏకంగా 3 పతకాలు కూడా తీసుకువచ్చారు.
మన ఇండియా నుంచి దాదాపుగా క్రీడాకారులు అంతా కూడా 18 ఆటల్లో పాల్గొన్నారు. వీటిల్లో మొత్తంగా సత్తా చాటి ఏడు పతకాలు తీసుకువచ్చారు. కాగా అందులో ఏకంగా మూడు పతాకాలు ఈశాన్యరాష్ట్రాల నుంచి వెల్లిన ఆటగాళ్లు తీసుకురావడమే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే 127మందిలో 8 మంది మాత్రమే ఈ ఈశాన్య రాష్ట్రాల నుంచి బయలు దేరి వెళ్లారు. ఈ లెక్కన ఈ ఆటగాళ్లు దాదాపు 38 శాతం పథకాలను తీసుకువచ్చినట్టు అని చెప్తున్నారు. ఇక మిగిలిన 119 మంది ఆటగాళ్లు మాత్రం కేవలం 4 పతకాలను తీసుకురావడం గమనార్హం. అంటే ఈ ఒలంపిక్స్‌లో ఎక్కువగా ఈశాన్యరాష్ట్రాల క్రీడాకారులే సత్తా చాటి పతకాలను తీసుకువచ్చారన్నమాట.
ఇక మన దేశం నుంచి నార్త్-ఈస్ట్ నుంచి సైఖోమ్ మీరాబాయి చాను మొదటగా పతకాన్ని వెయిట్ లిఫ్టింగ్‌లో సాధించింది. ఈమె తర్వాత లోవ్లినా బోర్గోహైన్ అనే క్రీడాకారణి బాక్సర్ గా సాధించిది. ఇలా చాలామంది పతకాలను సాధించి మన దేశానికి ఈ సారి కొంచెం ఎక్కువగానే గుర్తింపు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఇలా ఈస్ట్ రాష్ట్రాలకు చెందిన వారు పతకాలను సాధించడం ఇది కొత్తేమీ కాదని తెలుస్తోంది. గతంలో కూడా మేరీ కోమ్, అలాగే బైచుంగ్ భూటియా లాంటి ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఆటగాల్లే ఇలా మన దేశానికి ఎక్కువగా పతకాలను తీసుకువచ్చారు.
ఇక అప్పటి నుంచే ఈశాన్య భారతదేశాన్ని స్పోర్ట్స్ నర్సరీ అనే గుర్తింపు కూడా తీసుకువచ్చారు. అయితే నిఆనికి ఆ రాష్ట్రాల్లో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రతిభను ఎలా చాటుతున్నారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారుతోంది. కాగా ఈ రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాల కంటే కూడా చాలా ఎక్కువ వేడి లేదా ఎక్కువగా చల్లదనం ఉండకుండా దాదాపుగా జపాన్ లేదంటే జకార్తా లాంటి వాతావరణం ఇక్కడ ఉంటుందంట. ఈ వాతావరణ పరిస్థితులు ఒలింపిక్ లో ఆడే ఆటల వద్ద ఉండే వాతావరణానికి సరిగ్గా సరిపోతాయని చెప్తున్నారు క్రీడా విశ్లేషకులు.
ఈ రాష్ట్రాల్లో ఉండే కమ్యూనిటీ సర్వీస్ విధానం క్రీడాకారుల్లో మంచి ఫిట్ నెస్ తెస్తోంది. అంటే గ్రామంలో ఒక్కరి పొలంలో ఏదైనా పని ఉందంటే ఏకంగా గ్రామంలోని వారంతా కూడా అక్కడే కమ్యూనిటీగా పని చేస్తారు. ఇక ఇక్కడ నేచురల్ గానే దాంతో పాటు ఎలాంటి ఎరువులు లేకుండానే పండిన ఆర్గానిక్ పంటలను ఇక్కడ ఎక్కువగా తింటారంట. వీరి రెగ్యులర్ ఆహారంలో వెన్న, నెయ్యి, అలాగే , సోయాబీన్స్, పుట్టగొడుగులు ఎక్కువగా తినడం వల్ల చాలా బలిష్టంగా ఉంటారని తెలుస్తోంది.