Begin typing your search above and press return to search.

ఆషాడంలో కొత్త జంటకు ఎడబాటు.. ఎందుకు?

By:  Tupaki Desk   |   14 July 2021 7:32 AM GMT
ఆషాడంలో కొత్త జంటకు ఎడబాటు.. ఎందుకు?
X
కొత్తగా పెళ్లయిన జంట ఈ నెలలో కలిసివున్న కారణంగా గర్భం వస్తే బిడ్డ పుట్టేప్పటికి చైత్ర, వైశాఖ మాసాలొస్తాయి. అంటే అది మే నెల ఎండాకాలం అన్నమాట. భగ భగ మండే ఎండలకు బాలింతలు, పసిపాపలు తట్టుకోలేరని పెద్దవాళ్లు ఈ నియమం పెట్టారన్నది ఇందులోని శాస్త్రీయత. కానీ ఈ ఆరోగ్య రహస్యం చెప్పకపోవడం వలన వేరే అర్ధాలు తీసుకుని, యథేచ్ఛగా కల్సి వుంటున్నారు. ఇప్పుడంతా చిన్న ఫ్యామిలీలు.. ఉద్యోగ వేటలో పట్టణాలకు వెళ్లిపోతుండడంతో ఈ నెల్లాళ్లూ అత్తగారు మాత్రం తమ వద్దకు రాకుండా చూసుకుంటున్నారు.

* ఆషాడంలో కొత్త అల్లుడు అత్తవారింటికి వెళ్లకూడదన్న నియమం..

ఇక రెండోది ఆషాడంలో కొత్త అల్లుడు అత్తవారింటికి వెళ్లకూడదన్న నియమం వెనుకాలా అర్థం దాగివుంది. ఆషాడం అంటేనే వానాకాలం ప్రారంభంలో వస్తుంది. ఏరువాక మొదలై పొలం పనులు జోరందుకునే సమయం ఇది. ఈ సమయంలో కొత్త అల్లుడు ఇంటికి వస్తే అత్తింటివారు అతిథి మర్యాదలు చేయడానికి ఎంతో ఇబ్బంది పడతారు. పెళ్లయిన మొదట్లో భార్యా భర్తలకు విపరీతమైన ఆకర్షణ ఉండడం సహజమే. దీంతో కొత్త భార్యపై మోజుతో మగవాళ్లు పొలం పనులను నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉంది. అందుకే ఈ నియమం పెట్టారు.

పైగా ఈ మాసంలో దూరంగా ఉంటే ఎడబాటు బాధ కూడా వారికి బాగా తెల్సి వస్తుంది. దాంతో ఒకరి పై ఒకరికి విరహం, ప్రేమ రెట్టింపు అవుతాయి. వారు ఎల్లకాలం కలిసే ఉంటూ కష్ట సుఖాల్లో పెనవేసుకునేలా చేస్తుంది. ఇలాంటి ఎన్నో రహస్యాలు, ఆరోగ్య నియమాలు మేళవించి, ఆచారాలు రూపొందించారు మన పెద్దలు.