Begin typing your search above and press return to search.

స్టంప్స్ ను తీసుకెళ్లే ధోనీ వాటినేం చేస్తాడు?

By:  Tupaki Desk   |   13 March 2016 5:30 PM GMT
స్టంప్స్ ను తీసుకెళ్లే ధోనీ వాటినేం చేస్తాడు?
X
టీమిండియా కెప్టెన్ ధోనీ ఏదైనా మ్యాచ్ లో విజయం సాధిస్తే.. స్టంప్స్ ను తనతో తీసుకెళ్లటం చాలాసార్లు టీవీల్లో చూసేది. మరి.. అలా తీసుకెళ్లిన స్టంప్స్ ను ధోనీ ఏం చేస్తాడు? వాటిని ఎక్కడ ఉంచుతాడు? అన్న ప్రశ్న వేస్తే వచ్చే సమాధానం ఆసక్తికరంగా ఉండటమే కాదు.. ధోనీ మీద అభిమానం డబుల్ కావటం ఖాయం. ఫ్రెండ్ షిప్ కి ధోనీ ఇంత ప్రాధాన్యత ఇస్తాడా? అనిపించక మానదు.

మ్యాచ్ అయ్యాక ధోనీ తీసుకెళ్లే స్టంప్స్ వెనుక పెద్ద కథే ఉంది. కొన్నేళ్లుగా ఆయనిలా స్టంప్స్ ను తీసుకెళ్లటానికి కారణం.. అతడి స్నేహితుడు కుల్బిందర్. ఓ నేపాలి వాచ్ మెన్ కొడుకు. ధోని.. కుల్బిందర్ ఇద్దరూ జానీ జిగిరి దోస్తులు. వారి మధ్య అనుబంధం అంతాఇంతా కాదు. ధోనీ ఈ రోజు ఈ స్థాయికి రావటానికి అతను కూడా ఒక కారణం. తన చిన్ననాటి ప్రాణస్నేహితుడంటే ధోనీకి చాలా ఇష్టం.

కాలక్రమంలో ధోనీ ప్రఖ్యాత క్రికెటర్ గా అయితే.. కుల్బిందర్ మాత్రం పెద్దగా రాణించలేదు. అదే సమయంలో స్నేహితుడు అంత ఎత్తుకు ఎదిగినా.. ఎప్పుడూ ఎలాంటి సాయాన్ని కోరని వైనం కుల్బిందర్ ది. అలాంటి అతను ఇల్లు కట్టుకుంటున్నాడు. ఈ సందర్భంగా ధోనికి ఒక కోరిక కోరాడు.తాను కట్టుకుంటున్న ఇంటి చుట్టూ కర్రలతో ప్రహరీ నిర్మించాలని అనుకుంటున్నానని.. అందుకు 320 స్టంప్స్ కావాలని ధోనిని కోరాడు. స్నేహితుడి అడిగిన మాట కోసం అప్పటి నుంచి స్టంప్స్ ను ధోని సేకరిస్తున్నాడు. ఒక స్నేహితుడి మాట కోసం ఒక స్టార్ సెలబ్రిటీ ఇంత ప్రాధాన్యత ఇవ్వటం నిజంగా గ్రేట్ కదూ..?