Begin typing your search above and press return to search.
అపజయానికి ఐదు మెట్లు-3(అనుభవ శూన్యత)
By: Tupaki Desk | 25 Sep 2015 6:07 PM GMTజగన్ పార్టీ పెట్టిన తరువాత ఆయనకు ఎన్నో అవకాశాలు ఎదురొచ్చాయి.. రాజకీయంగా ఎదగడానికి ఎన్నో అంశాలు కలిసొచ్చాయి.. అందులో రాష్ట్ర విభజన అంశం అతిపెద్దది. అయితే... ఆ సమయంలో జగన్ అనుసరించిన తీరు ఆయనకు పెద్దగా లాభం చేకూర్చలేకపోయింది. అంతేకాదు... విశ్వాసమూ సంపాదించుకోలేకపోయారు. మరోవైపు కేసులు, జైలు జీవితం వంటివీ ప్రతిబంధకాలుగా మారాయి.
మరోవైపు జగన్ కు ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులు చుట్టుముట్టాయి. సీబీఐ దర్యాప్తులు... ఆస్తుల జప్తులు.. ఇలా ఉక్కిరిబిక్కిరయ్యాడు. జైలుకెళ్లాడు.... తాను జైళ్లో ఉండగా పార్టీని కాపాడుకునేందుకు చెల్లెలు షర్మిళను ముందుకుతెచ్చి పార్టీ శ్రేణుల్లో కొంత విశ్వాసం నింపాడు. అయితే... ఆ తరువాత మళ్లీ సీను మారింది. కాంగ్రెస్, టీడీపీ పార్టీలతో పాటు మీడియా కూడా జగన్ కు పొగపెట్టడానికి ఎంత చేయాలో అంత చేశాయి. జగన్ ఇక బయటకు రావడం కష్టమన్న ప్రచారం జరిగింది. ఆ పార్టీ పనైపోయిందని... జగన్ ను రాజకీయంగా తొక్కేయడం ఖాయమని భావించారు. కేసుల నుంచి బయటపడడానికి కాంగ్రెస్ తో రాజీకొస్తాడని.. పార్టీని విలీనం చేస్తాడని అనుకున్నారు.
అదేసమయంలో రాష్ట్ర విభజన అంశం తీవ్రస్థాయిలోకొచ్చింది. దానికి సంబందించిన పరిణామాల్లో జగన్ సీఎం కుర్చీ కోసం ఏ కాంగ్రెస్ తో విభేదించారో అదే కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరించారన్న విమర్శలనూ మూటగట్టుకున్నారు. అంతేకాదు... విభజన తరువాత కాంగ్రెస్ తో కలిసిపోయేలా కుమ్మక్కయ్యారన్న ఆరోపణలూ ఎదుర్కొన్నారు. అందులో పూర్తివాస్తవాలెలా ఉన్నా రెండువైపుల నుంచి ప్రయత్నాలు మాత్రం జరిగాయని చెబుతుంటారు. ఇలా... దూసుకెళ్తున్న తన కొత్త పార్టీ భవిష్యత్తు ఏంటనే విషయంలో జగన్ ప్రజలకు స్పష్టత ఇవ్వలేకపోయారు. తాను కడదాకా పోరాడుతాను... సీఎం కావడమే నా లక్ష్యం... కాంగ్రెస్ తో మళ్లీ కలవను అన్న క్లారిటీ ఆయన ఇవ్వలేకపోయారు. అప్పటికీ జగన్ లో మునుపటి దూకుడు తగ్గకపోయినా కొంత భయం మాత్రం ఏర్పడింది. పైకి గంభీరంగా కనిపించినా కేసుల వల్ల ఆయన తీవ్ర ఆందోళనకు గురైనట్లు స్పష్టంగా కనిపించేది.
వ్యక్తిగత సమస్యల్లో మునిగిపోవడం వల్ల రాష్ట్రంలో పరిణామాలపై తగిన స్థాయిలో స్పందించడం కష్టమయ్యేది. విభజన అంశాలపై స్పష్టమైన విధానం లోపించింది. అనుభవ శూన్యత అడుగడుగునా కనిపించేది. విభజనను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేయాల్సిన స్థాయిలో ఉన్న వైసీపీ ఆ విషయంలో విఫలమైంది. సమైక్యాంధ్ర హీరో కావాల్సిన జగన్ ఏమీ చేయలేకపోయారు.
మొత్తానికి ఆ సమయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నా పార్టీని మాత్రమైతే అందరూ అనుకున్నట్లుగా గాలికొదిలేయలేదు. అయితే.. అనుభవ రాహిత్యం కారణంగా రాజకీయంగా అందివచ్చిన అవకాశాలను మాత్రం వినియోగించుకోలేకపోయారు. ఆ ఫలితం జగన్ ను ఇప్పటికీ వెంటాడుతోంది.
-గరుడ
Disclaimer: Views expressed in this article are of the writer and do not represent the views of tupaki.com, and not necessarily reflect the opinions of the organisation either.