Begin typing your search above and press return to search.
జగన్:అపజయానికి ఐదు మెట్లు-2(అహంకారం)
By: Tupaki Desk | 25 Sep 2015 6:03 PM GMTవైఎస్ రాజశేఖరరెడ్డి పేరు వచ్చేలా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్(వైఎస్సార్ కాంగ్రెస్) పార్టీని ఏర్పాటు చేసిన జగన్ రాజకీయాల్లో సంచలనమయ్యారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించారు.. కాంగ్రెస్ ను దుమ్మెత్తి పోశారు... రాజకీయ పోటీదారు చంద్రబాబును, ఆయన పార్టీ టీడీపీని దుమ్ముదులిపారు... అయితే.. ఆయన ఏం చేసినా అందులో సీరియస్ నెస్ లేదు. పట్టుబట్టి నిలవడం ఉండదు. ఇప్పటికీ అదే తీరు. అయినా... వైఎస్ ఇమేజి... జగన్ పై ఆశతో చాలామంది వైసీపీ వైపు ఆకర్షితులయ్యారు. అందులో వైఎస్ అభిమానులున్నారు... జగన్ నమ్మకస్తులున్నారు.. కుటుంబీకులున్నారు.. సింపతీతో జగన్ సీఎం కావడం ఖాయమని, అప్పుడు తాము లాభపడొచ్చన్న ముందుచూపుతో చేరినవారున్నారు. మొత్తానికి వైసీపీ అయితే... ఏపీలో ప్రధాన రాజకీయపార్టీల్లో ఒకటిగా నిలిచింది. ప్రజలు కూడా ఆదరించారు. అయితే... పార్టీని నడిపించడంలో జగన్ పోకడల కారణంగా తొందరలోనే కొంత వ్యతిరేకత వచ్చింది. పార్టీలో వచ్చేవాళ్లు వస్తుంటే.. పోయేవాళ్లు పోయే పరిస్థితి. ఈ రోజు ఒకరికి ప్రయారిటీ దొరికితే, రేపు ఇంకొకరికి ప్రయారిటీ. అయితే.. ప్రజల ఆదరన ఉండడంతో పార్టీ నిలబడింది.
కానీ, వేర్వేరు పార్టీల నుంచి వచ్చి చేరిన నాయకులు... అప్పటికే ఫేడవుట్ అయినవారు ఉండడం... అందరూ తామే నంబర్ కావాలని ప్రయత్నించడం వంటివి పార్టీలో ఎక్కువైపోయాయి. వాటిని అరికట్టడానికి... పార్టీని దారినపెట్టడానికి జగన్ పెద్దగా ప్రయత్నాలు చేసిందిలేదు.. భవిష్యత్ సీఎంను నేనే... పార్టీలో ఉండేవారు ఉంటారు, పోయేవారు పోతారు. ఈ పార్టీని వదిలేసినవాడు నష్టపోతాడు అన్నట్లుగా ఆయన అహంకారంగా ఉండేవారు. ఏదైనా వివాదమైనప్పుడు కలగచేసుకోవడం తప్ప ముందే సమర్థులను ఎదిగేలా చేసి తనతో పాటు, నాయకత్వాన్ని నిర్మించి పార్టీని పటిష్ఠం చేసే ఆలోచనలు కూడా చేయలేదు. పార్టీ దానికదే పెరిగింది కానీ, జగన్ కృషి అందులో ఏమీ లేదన్నది సత్యం.
వివిధ పార్టీల నుంచి వచ్చిన సీనియర్ నాయకులు, రాజకీయ అనుభవం.. ఆలోచనలు ఉన్నవారున్నప్పటికీ వారిని సరిగ్గా ఉపయోగించుకోకపోవడం... విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వారి హవా నడవడంతో నేతల్లో అసంతృప్తి పెరిగింది. అసంతృప్తులను పట్టించుకోకపోవడం.. కారణాలు తెలుసుకోకపోవడం వల్ల కొందరు పార్టీని వీడారు. జగన్ అహంకారం... ఆయన విధానాలు నచ్చనివారూ వెళ్లిపోయారు. ఇలా దారితెన్నూ లేకుండానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వయం ప్రకాశమైందే తప్ప జగన్ చేసిందేమీ లేదు.
-గరుడ
Disclaimer: Views expressed in this article are of the writer and do not represent the views of tupaki.com, and not necessarily reflect the opinions of the organisation either.