Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ కొంపముంచిన రేవంత్ రెడ్డి మౌనం
By: Tupaki Desk | 13 Feb 2020 3:30 PM GMTకొడంగల్ సింహంగా .. ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన రేవంత్ రెడ్డి కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు. మున్సిపల్, సహకార సంఘాల ఎన్నికలు వచ్చినా ఎలాంటి విమర్శలు చేయకుండా మౌనంతో ఉన్నారు. ఆ మౌనం ఎందుకో తెలియదు గానీ అతడి మౌనం మాత్రం కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం చేకూరింది. ఇటీవల మున్సిపల్ ఎన్నికలు తెలంగాణలో జరిగాయి. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కనీవినీ ఎరుగని రీతిలో అద్భుతమైన ఫలితాలు పొందింది. కాంగ్రెస్ నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేకపోయింది. దానికి కొంత రేవంత్ రెడ్డి మౌనం కూడా కారణంగా తెలుస్తోంది.
ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి అంతగా ప్రచారం చేయలేదు. తన మల్కాజిగిరి నియోజకవర్గం లో కూడా ఆశించిన ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి రాలేదు. రేవంత్ ఇలాకాలో చామకూర మల్లారెడ్డి, సబితారెడ్డి ప్రతాపం చూపించారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ మంచి ఫలితాలు సాధించింది. ఎమ్మెల్యేల సహాయంతో మంత్రులు పని చేసి టీఆర్‌ఎస్ పార్టీకి అత్యధిక మున్సిపల్ స్థానాలు వచ్చేలా చేశారు. అయితే తన నియోజకవర్గంలో అంత చేస్తున్నా రేవంత్‌రెడ్డి పెద్దగా స్పందించలేదు. నామమాత్రంగా ప్రచారం చేసి మమ అనిపించాడు. తమ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చిన తర్వాత టీఆర్‌ఎస్ వారికి గాలం వేసి మరీ తమ పార్టీలో చేర్పించుకున్నారు. ఈ విషయంలో మంత్రి మల్లారెడ్డి చాకచక్యంగా వ్యవహరించారు.
కొంత మెరుగ్గా ఫలితాలు సాధించిన మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ నిలుపుకోలేకపోయింది. అవన్నీ కారు ఖాతాలోకే పోయాయి. నల్లగొండ జిల్లాలో కొమటిరెడ్డి సోదరుల మాదిరి పోరాడి ఉంటే ఒక స్థానమైనా వచ్చేది. కానీ రేవంత్‌రెడ్డి అంతగా స్పందించక పోవడంతో పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇంకో విషయమేమంటే రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం.. తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన కొడంగల్‌లో కూడా రేవంత్‌రెడ్డి ప్రభావం అంతగా కనిపించలేకపోయింది. రెండు రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి ప్రచారం చేశారు. ఆ ప్రచార సమయంలో గతంలో లాగ అధికార పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు చేయలేదు. అప్పటి ఊపు కనిపించలేకపోయింది. అందుకే కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ఫలితాలు దారుణంగా వచ్చాయి.