Begin typing your search above and press return to search.
ధిక్కార స్వరాల్లో తమ్ముళ్లదే ఎక్కువ
By: Tupaki Desk | 22 Jan 2016 5:39 AM GMTగ్రేటర్ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఎన్నికల్లోకీలకమైన నామినేషన్ల సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన అసంతృప్తులు తమ అసంతృప్తిని బాహాటంగానే బయటపెట్టుకున్నారు. నిరసనలు.. ఆందోళనలతో పాటు.. తమకు అవకాశం రాకుండా చేశారన్న కోపంతో ఓ మోస్తరు నేతల నుంచి కీలక నేతల్ని సైతం వదిలిపెట్టలేదు.
తెలుగుదేశం పార్టీ విషయాన్నే తీసుకుంటే.. ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు తనయుడు లోకేశ్ ఫ్లెక్సీని చించేసి తమ కోపాన్ని ప్రదర్శించారు. ఇక.. అధికార టీఆర్ ఎస్ లో అయితే.. ముఖ్యమంత్రి తనయుడు అసంతృప్తుల కోపాన్ని చల్లార్చే ప్రయత్నం చేసినా పెద్దగా ఫలితం ఇవ్వలేదు. ఆయన నేరుగా సీన్లోకి వచ్చి.. మాట్లాడే ప్రయత్నం చేస్తే తాత్కలికంగా అందుబాటులోకి రాకుండా ఉన్నఉదంతాలున్నాయి.
ఇక.. కాంగ్రెస్ నేతల పరిస్థితి అయితే మరీ దారుణం. పార్టీ కార్యాలయానికి రావటానికే వారు సంశయించే పరిస్థితి. ఇక.. బీజేపీ ఎమ్మెల్యే కారు మీదనే టిక్కెట్టు రాని అసంతృప్తులు దాడులు చేసే దుస్థితి. ఇలా సాగిన అసంతృప్తి నామినేషన్ల ఉపసంహరణ సమయానికి పార్టీ నాయకత్వం కిందామీదా పడి.. అసంతృప్తుల్ని బుజ్జగించే ప్రయత్నం చేసింది.
తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగిన వారికి సర్దిచెప్పి.. నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేసింది. అయితే.. అన్ని పార్టీలకు ఈ తలనొప్పి తప్పలేదు. ఆసక్తికరంగా ఈ బుజ్జగింపుల పర్వంలో టీటీడీపీ నాయకత్వం విఫలమైందని చెప్పాలి. తిరుగుబాటు అభ్యర్థుల చేత నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేయటంలో పార్టీ విఫలమైందనే చెప్పాలి.
ఒప్పందం ప్రకారం గ్రేటర్ బరిలో టీడీపీ 87 స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంటే.. 92 చోట్ల పార్టీ నాయకత్వం బీ పారాలు ఇవ్వటం గమనార్హం. ఈ పార్టీ తరఫున అసంతృప్తులు పెద్ద ఎత్తున బరిలో నిలిచి ఉన్నారు. ఒప్పందంలో భాగంగా టీడీపీతో సీట్ల సర్దుబాటు చేసుకున్న బీజేపీ మొత్తం 63 స్థానాల్లో పోటీ చేయాల్సి ఉన్నా.. 65 చోట్ల పోటీ చేస్తోంది. దీంతో.. మిత్రులుగా ఉన్న ఈ పార్టీల మధ్య కొన్ని స్థానాల్లో ప్రత్యర్థులుగా మారిన దుస్థితి.
ఇక.. అధికారిక టీఆర్ ఎస్ పార్టీలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. టిక్కెట్లు ఆశించి.. భంగపడిన వారు వందల సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. వ్యూహాత్మకంగా వ్యవహరించిన టీఆర్ ఎస్ నాయకత్వం వారందరి చేత (అత్యధికులు) నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేయటంలో సక్సెస్ అయ్యారు. అసంతృప్తుల్ని బుజ్జగించటంలో కేసీఆర్ తనయుడు.. మంత్రి కేటీఆర్ కీలకభూమిక పోషించి.. స్వయంగా రంగంలోకి దిగటంతో అసంతృప్తులు సంతృప్తి చెందిన పరిస్థితి. కాంగ్రెస్ లోనూ అసంతృప్తుల్ని బుజ్జగించటంలో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఏమైనా అసంతృప్తుల్ని బుజ్జగించటంలో అధికారి టీఆర్ఎస్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.
నామినేషన్ల పర్వం పూర్తి అయ్యాక ప్రధాన పార్టీల తరఫున బరిలో నిలిచిన అభ్యర్థుల్ని చూస్తే..
టీఆర్ ఎస్ 150
తెలుగుదేశం 95
బీజేపీ 66
కాంగ్రెస్ 149
మజ్లిస్ 60
సీపీఐ 21
సీపీఎం 22
లోక్ సత్తా 26
బీఎస్పీ 55
ఇండిపెండెంట్లు 636