Begin typing your search above and press return to search.
కారులో ఇంటి పోరు
By: Tupaki Desk | 19 Aug 2018 4:13 AM GMTతెలంగాణ రాష్ట్ర సమితిని కొత్త సమస్య వేధిస్తోంది. రానున్న ఎన్నికల్లో విజయం ఖాయమని ధీమాగా ఉన్న శాసనసభ్యులకు సొంత కుంపటి నుంచే మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో వారంతా గెలుపు సరే... ఇంటి పోరు ఎలా అని బెంబేలెత్తుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణ రాష్ట్ర సమితిలో సిట్టింగులందరికీ టిక్కట్లు ఖాయమని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రకటించారు. అయితే దీంతో పాటే ఆయన తనదైన స్ధాయిలో సన్నాయి నొక్కులు కూడా నొక్కారు. అదే సిట్టింగులను ఇబ్బందుల పాలు చేస్తోంది. ఇంతకీ అదేమనుకుంటున్నారా.... ఏం లేదు.. సిట్టింగులందరికీ టిక్కట్లు ఖాయమే కాని కొందరికి మాత్రం ఇవ్వలేం అని ప్రకటించారు. దీంతో సిట్టింగుల్లో ఆందోళన ప్రారంభమైంది. టిక్కట్టు దక్కదనుకున్న వారంతా తమ నియోజకవర్గాల్లో టిక్కట్లు దక్కే అవకాశాలు ఉన్నది ఎవరికా అని ఆరా తీయడం ప్రారంభించారు. అంతే కాదు.... తమ గురించి అధిష్టానం... ముఖ్యంగా పార్టీ అధినేత కె.చంద్రశేఖర రావు మనసులో ఏముందో తెలుసుకునే పనిలో పడ్డారు. తమకు టిక్కట్లు ఇస్తే ఓడిపోతారంటూ అధిష్టానం వద్దకు వస్తున్న ఫిర్యాదులతో వారంతా సతమతమవుతున్నట్లు సమాచారం.
టిక్కట్లు ఖాయమని ఓ పక్క చెబుతూనే మరో పక్క ద్వితీయ శ్రేణి నాయకులను ప్రోత్సహిస్తున్న అధిష్టానం తీరుతో వారంతానలిగిపోతున్నారు. కొందరైతే కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎలా ఉంటుందా అనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. నానాటికీ పెరుగుతున్న ఇంటిపోరుతో ఎన్నికల్లో గెలుపు కష్టమేనని వారంటున్నారు. మరోవైపు చాలా నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు ఈ సారి టిక్కట్టు తమదేనని, వచ్చే నెలలోనే తమ పేర్లను ప్రకటిస్తారని ప్రచారం చేసుకుంటున్నారు. ఇదంతా అధిష్టానమే చేయిస్తోందనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనికి కారణం సిట్టింగులను మారుస్తామని సంకేతాలు పంపడమేనని అంటున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు, లోక్ సభ సభ్యుల్లో టిక్కట్ల గుబులు రేకెత్తిస్తున్నారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు.
ఇక కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఏం జరుగుతోందో నిశితంగా పరిశీలిస్తోంది. అక్కడ అసంత్రప్తులను - టిక్కట్లు రావనే వారిని తమ పార్టీలోకి ఆహ్వానించాలన్నది కాంగ్రెస్ వ్యూహం. సెప్టెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధులను ప్రకటించగానే ఆపరేషన్ ఆకర్ష ప్రారంభించాలన్నది కాంగ్రెస్ వ్యూహం. తెలంగాణలో అధికారమే పరమావధిగా పని చేయాలని, ఇందుకోసం ఎవరు పార్టీలో చేరాలని వచ్చినా వారిని ఆహ్వానించాలని భావిస్తోంది. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు స్వేచ్ఛ ఇచ్చినట్లు చెబుతున్నారు.