Begin typing your search above and press return to search.
సీఎం ఇలాకలో రెబెల్స్ ఎంత ఎక్కువంటే?
By: Tupaki Desk | 22 Jan 2020 5:35 AM GMTతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పుర ఎన్నికల్లో తమకు తిరుగులేదన్న ధీమాను వ్యక్తం చేస్తున్న అధికారపక్షానికి అసలుసిసలైన ఇబ్బందికర పరిస్థితి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ లో నెలకొంది. రాష్ట్రంలోని మరే ఇతర ప్రాంతంలో లేని విధంగా ఇక్కడ రెబెల్స్ బెడద ఎక్కువగా ఉంది. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావటంతో అందరి చూపు ఇటువైపే ఉండే పరిస్థితి.
ఇదిలా ఉంటే.. ఇక్కడ పరిస్థితి మాత్రం అధికారపార్టీకి ఇబ్బందికరంగా మారింది. నియోజకవర్గ పరిధిలోని రెండు మున్సిపాలిటీల్లో ఏకంగా పార్టీ అభ్యర్థులకు.. రెబెల్స్ కు మధ్యనే నువ్వా నేనా? అన్నట్లుగా పోటీ నెలకొనటంతో గులాబీ పార్టీకి చెందిన క్యాడర్ అక్కడ రెండుగా చీలిపోయింది. దీంతో వారి మధ్య సాగుతుున్న పోటీతో గులాబీ దళంలో నిరాశ ఆవహరించింది.
గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని తుప్రాన్ మున్సిపాలిటీ సంగతే చూస్తే..అక్కడ మొత్తం 16 వార్డులకు ఏకంగా 13 వార్డుల్లో టీఆర్ ఎస్ రెబెల్స్ నిలవగా.. అందులో అత్యధికుల మధ్య పోటీ నువ్వా నేనా? అన్న రీతిలో సాగుతోంది. మరో మున్సిపాలిటీ పరిధిలోనూ పది వార్డుల్లో తిరుగుబాటు అభ్యర్థులు బరిలో నిలవటంతో.. ఫలితం కాస్త తేడా కొట్టినా.. పరువు పోతుందన్న భయాందోళనలో అధికారపక్షం ఉంది. దీంతో.. తుది ఫలితంపై ఇప్పుడు ఎడతెగని ఉత్కంఠ నెలకొంది.