Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ లో అసమ్మతి - అసంతృప్తి గోల

By:  Tupaki Desk   |   1 Oct 2018 10:15 AM GMT
టీఆర్ ఎస్ లో అసమ్మతి - అసంతృప్తి గోల
X
ముందస్తు ఎన్నికల వేళ రాజకీయాలు వేడెకెత్తున్నాయి. కేసీఆర్ 105మంది అభ్యర్థులను ప్రకటించడంతో అభ్యర్థులంతా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో ఊపు ఉంది. పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. టీఆర్ ఎస్ పార్టీ అభ్యర్ధులంతా జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ప్రచారం మొదలుపెట్టారు.

ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి గడిచిన సారి గెలిచి మంత్రి పదవి కొట్టేసిన జోగురామన్న అందరికంటే దూకుడుగా ఉన్నారు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నిర్మల్ లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మరోసారి గెలుపు కోసం పావులు కదుపుతున్నారు. ప్రచారానికి ఇంకా సమయం ఉండటంతో విపక్ష పార్టీలో వున్న ముఖ్యనేతలను టీఆర్ ఎస్ లోకి తీసుకోచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిర్మల్ లో ఇంద్రకరణ్ రెడ్డికి అసంతృప్తి నేత ఉన్నారు. టీఆర్ ఎస్ నేత శ్రీహరి రావు ఇంద్రకరణ్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఇది అసంతృప్తి ఎక్కువైంది. టీఆర్ ఎస్ అసంతృప్తుల్ని బుజ్జగించినా ఈయన మాత్రం మాట వినడం లేదట..

ఇక ముథోల్ టిఆర్ ఎస్ అభ్యర్థి - తాజా మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సైతం ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు. విఠల్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్యే వేణుగోపాలచారి వర్గీయులు జీర్ణించుకోవడం లేదు. వేణుగోపాలాచారి సేవలను జిల్లా వ్యాప్తంగా వినియోగించుకోవడం ద్వారా వివాదాన్ని కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే చారితో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంప్రదింపులు జరిపారు. చారి వర్గీయులు సహకరించుకున్నా.. విఠల్ రెడ్డి గ్రామాలను చుట్టివస్తున్నారు.

ఇక ఖానాపూర్ నియోజకవర్గంలోనూ టిఆర్ ఎస్ అభ్యర్ధి - తాజా మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రచారం జోరందుకుంది. లంబాడా సామాజిక వర్గానికి చెందిన రేఖానాయక్ కు టికెట్ ఇవ్వడాన్ని ఆదివాసీ సంఘాలు తప్పుపడుతున్నాయి. ఇక్కడ టీఆర్ ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కాంగ్రెస్ లో చేరిపోయారు. అటు బోథ్ నియోజకవర్గంలో టీఆర్ ఎస్ అభ్యర్ధి తాజా మాజీ ఎమ్మెల్యే కోవ లక్సి ప్రచారంలో ముందున్నారు.

అసిఫాబాద్ నియోజకవర్గంలో టిఆర్ ఎస్ అభ్యర్థి - తాజా మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మీ ప్రచారంలో ముందున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో టీఆర్ ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్పకు తిరుగులేకుండా ఉంది. ఈయనను ఓడించాలని ప్రత్యర్థులంతా జట్టు కట్టారు.

ఇక రెబల్ స్టార్ ఎమ్మెల్యేగా పేరొందిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు నియోజకవర్గంలో అసమ్మతి వర్గం ఎక్కువైంది. టికెట్ దక్కని రేణికుంట్ల ప్రవీణ్ మాజీ ఎంపీ వివేక్ వర్గంతో కలిసి రెబల్ గా పోటీచేసి ఓడించాలని చూస్తున్నాడు. ఇక మంచిర్యాలలో టీఆర్ ఎస్ అభ్యర్థి దివాకర్ రావు ను వ్యతిరేకిస్తున్న పలువురు ఓడిస్తామని అంటున్నారు. చెన్నూర్ లో టీఆర్ ఎస్ అభ్యర్థి - ఎంపీ సుమన్ ప్రచారం మొదలై కార్యకర్త ఆత్మహత్యతో ఆగిపోయింది.