Begin typing your search above and press return to search.

స్పీకర్ పై తిరుగుబాటు ఎంపీ తీవ్ర అసంతృప్తి ?

By:  Tupaki Desk   |   22 Oct 2022 6:30 AM GMT
స్పీకర్ పై తిరుగుబాటు ఎంపీ తీవ్ర అసంతృప్తి ?
X
తనను విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టిన సీఐడీ అధికారులపై యాక్షన్ తీసుకోకపోవటంపై వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విచారణ పేరుతో తనను చిత్రహింసలు పెట్టిన సీఐడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని లేఖ రాసినా ఎలాంటి ఉపయోగం కనబడలేదని రఘురాజు లోక్ సభ స్పీకర్ కు మరోసారి లేఖ రాశారు. ఏపీ సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్, డీఐజీ సునీల్ నాయక్, ఏఎస్పీ విజయ్ పాల్, ఏఎస్ఐ పసుపులేటి సుబ్బారావు, కానిస్టేబుల్ మల్లేశ్వరరావు తనను చిత్రహింసలు పెట్టినట్లు ఆరోపించారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచనల కారణంగా పై అధికారులంతా తనను కస్టడీ పేరుతో తీవ్రంగా కొట్టినట్లు చెప్పారు. పీవీ సునీల్ కుమార్ పై అనేక అవినీతి ఆరోపణలతో పాటు గృహహింస కేసు కూడా నమోదైన విషయాన్ని స్పీకర్ కు రాసిన లేఖలో ఎంపీ గుర్తుచేశారు. పైన చెప్పిన అధికారులపై చర్యలు తీసుకోవాలని తాను లేఖరాసినా ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవటం అన్యాయమన్నారు.

జరిగిన ఘటనపై తాను సభాహక్కుల కమిటీకి లేఖ రాసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోని విషయంపై ఎంపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిటీకి ఉన్న అధికారాలతో వెంటనే ఆ అధికారులందరినీ పిలిపించి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. వారిపై విచారణ చేయటంలో, యాక్షన్ తీసుకోవటంలో ఆలస్యమైతే పార్లమెంటుపైనే జనాల్లో నమ్మకం పోతుందని కూడా తిరుగుబాటు ఎంపీ హెచ్చరించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.