Begin typing your search above and press return to search.
టీఆర్ఎస్ లో తిరుగుబాటు.. తెలంగాణలో ముందస్తు ఖాయమట
By: Tupaki Desk | 19 Oct 2021 4:11 AM GMTఈసారికి మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించిన వేళ.. అందుకు ప్రతిగా కౌంటర్ వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలన్ని ముందస్తు ఎన్నికల దిశగానే వెళుతున్నట్లు చెప్పిన ఆయన.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లో తిరుగుబాటు ఖాయమని.. గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే సమయంలోనే తెలంగాణలోనూ ముందస్తు ఎన్నికలు జరుగుతాయని చెబుతున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ డైరెక్షన్ లోనే ఇదంతా సాగుతుందని.. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. 2022 ఆగస్టు 15తో దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతుందని.. ఆ సందర్భంగా కొత్త శకానికి నాంది అని చెబుతూ కేసీఆర్ ముందస్తుకు వెళ్లటం ఖాయమన్నారు. అసలు ఎవరు అడిగారని ముందస్తుపై సీఎం కేసీఆర్ మాట్లాడారని ప్రశ్నించారు. యూపీలో జరిగే ఎన్నికల్లో బీజేపీకి కేసీఆర్ సహకారం ఉంటుందన్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ పార్టీలో తిరుగుబాటు ఖాయమన్న సంచలన వ్యాఖ్యను చేశారు రేవంత్. ఈ విషయాన్ని గుర్తించిన కేసీఆర్.. ముందస్తుగానే పార్టీ ప్లీనరీ అని.. విజయగర్జన పేరుతో సభల్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హరీశ్ రావు త్వరలోనే పార్టీ నుంచి బయటకు పంపుతారని పేర్కొన్నారు. మిత్రద్రోహి పేరుతో ఆయన్ను బయటకు పంపుతారన్న జోస్యాన్ని చెప్పారు రేవంత్ రెడ్డి. ఏం సాధించారని టీఆర్ఎస్ పార్టీ విజయగర్జన సభను నిర్వహిస్తున్నారు? అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. మరి.. ఆయన సీరియస్ వ్యాఖ్యలకు గులాబీ దండు ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.