Begin typing your search above and press return to search.
ఆ ఇద్దరు గవర్నర్ల తీరు రచ్చరచ్చ అవుతోంది
By: Tupaki Desk | 6 July 2017 7:00 AM GMTబీజేపీ పెద్దల ముందుకు మరో వివాదం వచ్చిపడింది. పశ్చిమ బెంగాల్ - పుదుచ్చేరిల గవర్నర్ల వ్యవహార శైలిపై వివాదం రగులుకుంది. ఈ గవర్నర్లు కేంద్రం ఏజెంట్లుగా - అంతకు మించి బీజేపీ పావులుగా వ్యవహరిస్తున్నారని , వారిని వెంటనే తొలిగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఆయా రాష్ర్టాల్లోని ముఖ్యమంత్రులకు అండగా కాంగ్రెస్ నిలుస్తోంది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేషరీనాథ్ త్రిపాఠీ - పుదుచ్చేరి రాజ్యపాలకురాలు కిరణ్ బేడీలు తమ విద్యుక్త ధర్మాన్ని - రాజ్యాంగ నిబంధనలను కాలరాస్తున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. రాజ్యాంగ అతిక్రమణకు పాల్పడుతున్న వారిరువురిని రీకాల్ చేయాల్సిందేనని కాంగ్రెస్ కోరింది. గవర్నర్ పదవిని కేంద్రంలోని బీజేపీ పూర్తిగా దుర్వినియోగపరుస్తోందని, తరచూ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో అస్తిరత్వం నెలకొనేలా చేసేందుకు యత్నిస్తోందని కాంగ్రెస్ మండిపడింది.
ఈ రెండు రాష్ర్టాల గవర్నర్ల వ్యవహార శైలి శృతి మించిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుస్మిత దేవ్ స్పందించారు. ఎన్ డీఎ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వారి పావులుగా నియుక్తులైన గవర్నర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, రాజ్యాంగ నిబంధనలను పాతరవేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ - ఉత్తరాఖండ్ లో అప్పట్లో జరిగిందే ఇప్పుడు బెంగాల్ - దక్షిణాదిన పాండిచ్చేరిలలో జరుగుతోందని ఇది దారుణం అని సుస్మితదేవ్ తెలిపారు. బీజేపీ - ఆర్ ఎస్ ఎస్ కీలుబొమ్మలుగా మారి రాజకీయ ప్రయోజనాల కోసం పదవులను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేకించి కిరణ్ బేడీ అన్ని విధాలుగా నియమ నిబంధనలకు తూట్లు పొడిచారని, ఓటమి పాలయిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలతో నామినేటెడ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయించారని తెలిపారు.
కాగా, బెంగాల్ గవర్నర్ త్రిపాఠీ ఏకంగా బీజేపీ బ్లాక్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారని బెంగాల్ సీఎం మమత బెనర్జీ విమర్శించారు. తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ పై మమత బెనర్జీ ఆరోపణను రాజ్ భవన్ వర్గాలు ఖండించాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్య మంత్రి పట్ల గవర్నర్ స్థాయికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కాగా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ బీజేపీ ఏజెంట్ గా మారారని ఆమె ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని పుదుచ్చేరి సీఎం వి నారాయణస్వామి విమర్శించారు. నామినేటెడ్ ఎమ్మెల్యేలుగా బీజేపీ వారిని ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. రాజ్యాంగ పరిధిని పాటించకుండా, అసెంబ్లీని పరిగణనలోకి తీసుకోకుండా ఆమె ఏ విధంగా సొంత నిర్ణయాలు తీసుకుంటారని నిలదీశారు. బేడీ చర్యకు నిరసనగా మిత్రపక్షం డీఎంకె 8 వ తేదీన ఇచ్చిన బంద్ పిలుపునకు అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది.