Begin typing your search above and press return to search.

అందులేడు.. ఇందులేడు.. అన్నింటా మన ‘అదానీ’నే

By:  Tupaki Desk   |   25 Aug 2022 9:30 AM GMT
అందులేడు.. ఇందులేడు.. అన్నింటా మన ‘అదానీ’నే
X
దేశమంతా ఇప్పుడు అదానీ మయం అవుతోంది. ఎక్కడ చూసినా అదానీ కంపెనీలే కనిపిస్తున్నాయి. ఉప్పు పప్పు నుంచి వంటనూనెల వరకూ.. విద్యుత్ రంగం నుంచి పోర్టుల వరకూ.. తాజాగా మీడియా రంగంలోనూ అదానీ రంగ ప్రవేశం చేశారు. మోడీ సర్కార్ పాలనలో ఆయన బెస్ట్ ఫ్రెండ్ ఇంతలా పురోభివృద్ధి సాధించడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

మార్కెట్ లో ఇప్పుడు అదానీయే అన్నింట్లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. అదానీ కంపెనీలు తాజాగా ఎన్డీటీవీని టేకోవర్ చేసుకునేందుకు ప్రయత్నించడంతో మీడియా రంగంలోనూ వారి హవా మొదలైనట్టు అయ్యింది. అదానీ మీడియా రంగంలోకి ఎంట్రీని ఆపుదామని అనుకున్నా.. అడ్డుకోలేని స్థాయికి తన స్ట్రాటజీలు అమలు చేశఆరు. ఇదే బిజినెస్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

గౌతం అదానీ ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ 4 ధనవంతుడు. వ్యాపారంలో తక్కువ సమయంలో అగ్రస్తానానికి ఎదిగిన కుబేరుడు. వేగంగా అడుగులు వేస్తుంటారు. పక్కా లెక్కలేసి ట్రెండింగ్ రంగాల్లోకి విస్తరిస్తున్నాడు. ఆయన దూకుడే భారత వ్యాపార రంగంలో తిరుగులేని మహారాజుగా నిలిపింది.

ప్రస్తుతం అదానీ పోర్టుల నుంచి పవర్ ప్లాంట్ల వరకూ.. సిమెంట్ కంపెనీల నుంచి మీడియా వరకూ ప్రతీ వ్యాపారాన్ని ఆయన అందుకుంటున్న తీరే కార్పొరేట్ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఎన్డీటీవీని టేకోవర్ చేసుకునేందుకు అదానీ గ్రూప్ చేస్తున్న ప్రయత్నం బిజినెస్ సర్కిల్స్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

12 ఏళ్ల క్రితం 2008లో ఎన్డీటీవీకి వీపీసీఎల్ అనేసంస్థ అప్పుగా ఇచ్చిన డబ్బులే ఆ సంస్థ అదానీ చేజిక్కించుకునేందుకు దోహదపడింది. ఎన్డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, ఆక్ష్న భార్యరాధికారాయ్ లకు 2009లో 350 కోట్లు, 2010లో 53 కోట్లు వీపీసీఎల్ సంస్త అప్పుగా ఇచ్చింది. అప్పుకు బదులుగా ఎన్డీటీవీలో వీపీసీఎల్ సంస్థకు వాటాలు ఇచ్చారు. 29.18 శాతం వాటాను ఆ అప్పుకు గాను కట్టబెట్టారు. అంబానీ గ్రూపు నుంచి అప్పులు తీసుకొని ఎన్డీటీవీకి వీపీసీఎల్ సంస్థ అప్పులు ఇచ్చింది. ఇప్పుడు వీపీసీఎల్ వాటాను అదానీ గ్రూప్ తెలివిగా మూడో కంటికి తెలియకుండా కొనేసింది.

అయితే అంబానీల చేతుల్లో నుంచి అదానీ చేతుల్లోకి వీసీపీఎల్ ఎలా వచ్చిందన్నదే ఇప్పుడు ఎవరికీ అంతు చిక్కడం లేదు. ప్రస్తుతం ఎన్డీటీవీలో ప్రణయ్ రాయ్ , రాధికారాయ్ ఇద్దరికీ కలిపి 32.26 శాతం వాటా ఉంది. అదానీ వాటా 29.18 శాతం.. కార్పొరేట్ నిబంధనల ప్రకారం కనీసం 20 శాతం వరకూ ఓపెన్ ఆఫర్ కు వెళ్లవచ్చు.

అదానీ గ్రూప్ మాత్రం ఏకంగా 26శాతం ఓపెన్ ఆఫర్ కు వెళ్లింది. ఇక మిగిలిన 26శాతం కూడా ఎన్డీటీవీలో కొనేసి దాన్ని పూర్తి స్థాయిలో దక్కించుకునేందుకు అదానీ అడుగులు వేస్తున్నారు.