Begin typing your search above and press return to search.
నెలకు రూ.2లక్షల జీతం.. రూ.30వేల కక్కుర్తి తో ఏసీబీకి దొరికేశాడు
By: Tupaki Desk | 13 Nov 2021 4:03 AM GMTఏదో చిన్న జీతగాడు కాదు. నెలకు రూ.2లక్షలకు పైనే జీతం.. అయినా రోజువారీగా వచ్చే గీతమంటే మహా ప్రాణం. ఆ కక్కుర్తే అతడ్ని ఏసీబీకీ అడ్డంగా దొరికేలా చేసింది. భారీగా జీతాలు వస్తున్నా.. ఈజీగా వచ్చే డబ్బుల కోసం పడిన కక్కుర్తి కేసు రూపంలో మెడకు చుట్టుకుంది.
తాజాగా ఏసీబీ అధికారులకు దొరికిపోయిన విద్యుత్ విభాగానికి చెందిన అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) చరణ్ సింగ్ ఉదంతం షాకింగ్ గా మారింది. చాలీ చాలని జీతాలు ఉన్న వారు లంచం కోసం పీక్కుతింటారన్న దానికి బదులుగా.. జీతాలు మస్తుగా వస్తున్నా.. రోజువారీగా వచ్చే గీతం మీద ఉండే మోజు ఎంతన్న విషయం తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.
హైదరాబాద్ లోని గోల్కొండ ఇబ్రహీంబాగ్ విద్యుత్ సబ్ డివిజన్ ఆఫీసులో జరిగిన ఈ ఉదంతం సంచలనంగా మారింది. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ టీం పట్టుకున్న ఈ బడా అధికారి వివరాలు ఇలా ఉన్నాయి. ఇబ్రహీంబాగ్ సబ్ డివిజన్ లో ఏడీఈగా పని చేస్తున్నాడు చరణ్ సింగ్. మొయినాబాద్.. శంకర్ పల్లి.. నార్సింగ్.. ఇబ్రహీంబాగ్ డివిజన్లలో జరిగే పనుల్ని ఇతగాడు పర్యవేక్షిస్తుంటాడు.
మణికొండకు చెందిన కాంట్రాక్టర్ రవి విద్యుత్ శాఖలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాడు. మణికొండలో విద్యుత్ తీగల్ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చటం సహా కొత్త ట్రాన్స్ ఫార్మర్లుఅమర్చే పనుల టెండర్ ను అధికారికంగా సొంతం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన అనుమతి పత్రం అవసరం. దీన్ని జారీ చేయాల్సింది ఏడీఈ చరణ్ సింగే.
అయితే.. ఆ పత్రాన్ని ఇవ్వాలంటే తనకు లంచం ఇవ్వాలని అడగటంతో కాంట్రాక్టర్ రవి ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించాడు.
ముందుగా వేసుకున్న పథకం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం కాంట్రాక్టర్ రవి రూ.30వేలతో ఏడీఈ కార్యాలయానికి వెళ్లాడు. లంచం సొమ్మును రవి నుంచి చరణ్ సింగ్ తీసుకుంటున్న వేళ.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం అదేపులోకి తీసుకున్న అతన్ని విచారించారు.
ఏసీబీ ప్రత్యేక కోర్టును హాజరుపర్చగా రిమాండ్ కు ఆదేశాలు జారీ చేయటంతో జైలుకు తరలించారు. చరణ్ సింగ్ ఇంటిని.. ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు. ఈ ఉదంతం విద్యుత్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోంది. నెలకు రూ.2లక్షల జీతం వస్తున్నా కూడా ఇంతలా పాడు బుద్ధా? అని అందరూ అవాక్కుఅయ్యే పరిస్థితి.