Begin typing your search above and press return to search.
గతాన్ని మర్చిపోయినట్లు జగన్ మాటలతో ఇమేజ్ కాదు డ్యామేజ్
By: Tupaki Desk | 25 Dec 2022 11:30 AM GMTఅందుకే అంటారు ఒక మాట అనే ముందు కాస్తంత వెనుకా ముందు చూసుకోవాలని. అధికారం చేతిలో ఉన్నప్పుడు కాస్తంత అడ్వాంటేజ్ ఉంటుంది. అందునా ముఖ్యమంత్రి జగన్ లాంటి వారికి అది మరింత ఎక్కువగా ఉంటుంది. అలా అని ఏదో ఒకటి మాట్లాడేస్తే.. మిగిలిన వారు చూస్తూ ఊరుకోరు కదా? సోషల్ మీడియా లేని కాలంలో అయితే.. కాస్తంత సర్దు కోవచ్చు. ఇప్పుడు నడిచేది అంతా డిజిటల్ యుగం. కీలక స్థానాల్లో.. అత్యుత్తమ స్థాయిలో ఉన్న వేళ.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే కలిగే నష్టం అంతా ఇంతా కాదు.
ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయంలో. తన రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబు.. పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఆయన తరచూ ఏదో ఒక వ్యాఖ్య చేస్తూ తేనెతుట్టెను కదిలిస్తుంటారు. అయితే.. అలా చేసిన ప్రతిసారీ ఆయన చూపించే వేలుకు ప్రతిగా నాలుగు వేళ్లు జగన్ ను ఉద్దేశించి ప్రశ్నిస్తుంటాయి. ఇవన్నీ అంతకంతకూ పెరిగిపోయి.. ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేసే వరకు వెళుతున్నాయి.
అంతేకాదు.. జగన్న మాటల్లోని డొల్లతనాన్ని చూపించేందుకు సోషల్ మీడియా.. యూట్యూబ్ లు లాంటివి ఉండనే ఉన్నాయి. ఇలాంటి వాటి సాయంతో గతంలో చేసిన వ్యాఖ్యలు.. చెప్పిన మాటలు.. తాజాగా అంటున్న వాటికి సంబంధించిన వివరాల్ని ప్రస్తావిస్తూ.. దానికి తగ్గ ఆధారాల్ని చూపిస్తూ.. జగన్ చేస్తున్న వ్యాఖ్యల్లో డొల్లనతన్నాన్ని చూపించటం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో.. ఆయన ఇమేజ్ మరింత ఖరాబు అయ్యే పరిస్థితి.
తాజాగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు మాదిరిగా ఆ రాష్ట్రం కాకుంటే ఈ రాష్ట్రం అనో.. ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ అనో నేను అనటం లేదు. ఇదే నా రాష్ట్రం. ఇక్కడే నా నివాసం. ఇక్కడే నా మమకారం. ఇక్కడే నా రాజకీయం’’ అని చెబుతున్న జగన్ మాటల్ని చూస్తే.. ప్రజలు విషయంలో జగన్ ఆలోచనలు మరీ ఇలా ఉంటాయా? అన్న సందేహం కలుగుక మానదు. అంటే.. జగన్ ఏం చెబితే దాన్ని నమ్మేయటమే తప్పించి ఇంకేం చేయరని అనుకుంటున్నారా? అన్న సందేహం కలుగక మానదు.
ఎందుకంటే.. ఏపీలో రాజకీయం మొదలు పెట్టే నాటికే బెంగళూరులో.. హైదరాబాద్ లో ప్యాలెస్ లను తలపించే భవనాలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. విపక్ష నేతగా కూడా ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారు. ఏపీకి ముఖ్యమంత్రి కావాలన్న బలీయమైన కోరిక ఉన్న వేళలోనూ ఆయన ఏపీలో కాకుండా హైదరాబాద్ లోనే ఉన్నారన్నది మర్చిపోకూడదు. 2014 ఎన్నికల తర్వాత విపక్ష నేతగా ఉన్న ఆయన ఏపీకి అతిధిగానే వచ్చే వారే తప్పించి.. ఆయనేమీ ఏపీలోనే ఉండిపోలేదు.
విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ను కలిసేందుకు ఆ పార్టీకి చెందిన నేతలంతా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు వెళ్లి కలిసే వారే తప్పించి.. జగన్ ప్రత్యేకంగా ఏపీకి వచ్చి.. అక్కడే ఉండిపోయింది లేదన్నది మర్చిపోకూడదు. చివరకు2019ఎన్నికలకు సంబంధించిన వైసీపీ వార్ రూం హైదరాబాద్ నుంచే ఆపరేట్ చేశారే తప్పించి.. ఏపీలో నుంచి కాదన్నది వాస్తవం. ఇలాంటప్పుడు జగన్ మాటల్లో ఇసుమంతైనా నిజం ఉందా? అన్నది ప్రశ్న.
ఇదంతా ఎందుకు? తాడేపల్లిలో ఆయన ప్యాలెస్ నిర్మించుకున్న వేళ చెప్పిందేమిటి? తాము అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా మారుస్తామని అనుమానం చెందుతున్నారని.. ఆ అనుమానాన్నే ప్రచారం చేస్తున్నారని.. అలాంటిదేమీ లేదని చెప్పేందుకే తాడేపల్లిలో తాను ఇంటిని కట్టుకున్నట్లుగా చెప్పిన జగన్.. చివరకు తన చేతికి అధికారం వచ్చిన తర్వాత చేసిందేమిటి? ఏపీ రాజధాని అమరావతినే అన్న ఆయన చివరకు మూడురాజధానులుగా చేసిన వైనాన్ని ఏమనాలి? ఎలా చూడాలి. ఇదేనా విశ్వసనీయత అంటే? ఇదేనా మడమ తిప్పకపోవటం అంటే? చంద్రబాబును.. పవన్ ను ఉద్దేశించి మాటలు అనేస్తున్న జగన్.. తాను చాలా సాధిస్తున్నట్లుగా భావిస్తున్నారు. కానీ.. తాను అన్న మాటలు తనకు రివర్సు వచ్చి తగులుతున్నాయన్న విషయాన్ని మిస్ అవుతున్నారు.