Begin typing your search above and press return to search.
తెలంగాణ పథకాలు ఇక, ఆగవ్.. రీజన్ ఇదే!
By: Tupaki Desk | 30 Aug 2022 9:20 AM GMTకేంద్రం నుంచి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి సాయం అందడం లేదు. దీంతో కొన్ని పథకాలకు నిధులు లేక ఇబ్బందులు పడిన పరిస్థితి తెలిసిందే.అ యితే.. తాజాగా సీఎం కేసీఆర్ ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సొంత నిధులు.. ఆదాయ మార్గాలను ఆయన పెంచుకున్నారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో రాష్ట్రానికి పన్ను ఆదాయం అంచనాల్లో 31 శాతం సమకూరింది.
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. బడ్జెట్‌లో పన్ను ఆదాయం లక్షా 26 వేల కోట్ల రూపాయలుగా అంచనా వేయగా జులై నెలాఖరు వరకు అందులో 31 శాతం.. అంటే రూ.39 వేల కోట్లు సమకూరాయి.
జీఎస్టీ ద్వారా రూ.12 వేల 986 కోట్లు.. స్టాంపులు- రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.4 వేల 910 కోట్లు.. అమ్మకం పన్ను ద్వారా రూ.10 వేల 83 కోట్లు, ఎక్సైజ్ పన్నుల ద్వారా రూ.5 వేల 777 కోట్లు వచ్చాయి. పన్నేతర ఆదాయం బడ్జెట్ అంచనా అయిన రూ.25 వేల కోట్లకు గానూ 29 శాతానికి పైగా అంటే రూ.7 వేల 432 కోట్లు సమకూరింది.
కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా ఈ ఏడాది రూ.12 వేల కోట్లు వస్తాయని అంచనా వేయగా.. జులై నెలాఖరు వరకు అందులో 21 శాతం అంటే రూ.2 వేల 867 కోట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రం నుంచి వస్తాయనుకు న్న గ్రాంట్ల మొత్తం చాలా తక్కువగా ఉంది.
ఈ ఏడాది వివిధ గ్రాంట్ల రూపంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.41 వేల కోట్ల రూపాయలు వస్తాయని భారీగా అంచనా వేశారు. అయితే ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో అందులో కేవలం 4.85 శాతం మేర.. అంటే రూ.1988 కోట్లు మాత్రమే వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం చేకూరింది. ఫలితంగా ప్రభుత్వం ఎన్నికల ముంగిట అమలు చేయాలని భావిస్తున్న అనేక పథకాలకు సొమ్ములు చేకూరినట్టు అయింది. ఇప్పటికే నిలిచిపోయిన దళిత బంధు సహా ఇతర పథకాలకు విరివిగా.. నిధులు సమకూరినట్టేనని.. ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.