Begin typing your search above and press return to search.

రాజీనామా చేస్తానంటున్న మంత్రి.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదట!

By:  Tupaki Desk   |   12 Jan 2023 6:53 AM GMT
రాజీనామా చేస్తానంటున్న మంత్రి.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదట!
X
ఆ ప్రాంతాలను ప్రభుత్వం పట్టించుకోలేదట.. అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదట.. ఒకవేళ ఇచ్చారని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని రాష్ట్ర మంత్రి సంచలన ప్రకటన చేశారు. ఆ ప్రాంతాల్లో అభివృద్ధి చేశామని కొందరు చెబుతున్నా.. అవన్నీ అవాస్తవాలనీ.. ఒకవేళ అభివృద్ధి జరిగిందని నిరూపించడానికి చర్చ పెడితే తాను రావడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. బీఆర్ఎస్ కు చెందిన ఈ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇంతకు ఆయన ఎవరితో సవాల్ విసిరారు..? రాజీనామా చేస్తానని ఎవరితో అంటున్నారు..?

తెలంగాణలోని మంత్రి ఎర్రెబెల్లి దయాకర్ రావు పేరు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదంగానూ మారుతూ ఉంటాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఆయన ఆ ప్రాంత రాజకీయాలను శాసిస్తున్నారు.

పార్టీ నాయకులను తన గుప్పెట్లో పెట్టుకొని వ్యవహారాలు నడిపిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ , బీజేపీలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి ఎర్రబెల్లి స్పందించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులపై హాట్ హాట్ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రంతో పోలుస్తున్నారు.. తెలంగాణ కంటే ఆ రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధి ఎక్కువేం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వకున్నా సొంత నిధులతో అభివృద్ధి చేసుకుంటుందన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కంటే మిగతా రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధి ఎక్కువగా ఉంటే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. అభిృద్ధిపై చర్చకు రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా..? అని సవాల్ విసిరారు.

ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలోవైరల్ అవుతున్నారు. దీంతో కొందరు బీజేపీ శ్రేణులు ఆయన వ్యాఖ్యలపై కౌంటర్ ఇస్తున్నారు. అయితే బీజేపీ ప్రముఖులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.