Begin typing your search above and press return to search.
662 మంది విదేశీయుల దేశ బహిష్కరణ .. ఆ దేశం కీలక నిర్ణయం
By: Tupaki Desk | 28 Oct 2021 6:11 AM GMTగల్ఫ్ దేశాలకి పలు దేశాల ప్రజలు ఉపాధి కోసం వలస వెళ్తుంటారు. ఉన్న ప్రదేశం లో సరైన ఉపాధి , ఆదాయం లేక కుటుంబాల్ని వదిలి ఆదాయాన్ని ఆర్జించడానికి ఎక్కువమంది వెళ్లే దేశాలు గల్ఫ్. చదువుకున్న వారు ఎక్కువగా యూకే , యూఎస్ అంటూ వెళ్తే చదువుకున్న వారు , చదువులేని వారు సైతం గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లి , షేక్స్ వద్ద పనులు చేస్తూ భారీగా సంపాదిస్తుంటారు. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో చాలామంది అక్కడికి వెళ్లిన తర్వాత చాలామంది అనేక ఇబ్బందులకు కూడా గురౌతుంటారు. అయితే తాజాగా కువైట్ సంచలన నిర్ణయం తీసుకుంది.
కువైట్ చట్టానికి విరుద్ధంగా దేశంలో ఉంటున్న విదేశీయులపై కువైట్ ప్రభుత్వం తాజాగా ఉక్కుపాదం మోపింది. రెసిడెన్సీ గడువు ముగిసిన ఇంకా కువైట్ లోనే ఉంటున్న వలసదారులను గుర్తించి వారి దేశాలకు పంపిస్తున్నారు. అలాగే ఇతర ఉల్లంఘనలకు పాల్పడిన వారిని కూడా దేశం నుంచి బహిష్కరిస్తున్నారు అక్కడి అధికారులు. గడిచిన వారం రోజుల్లోనే ఏకంగా 600 మందికి పైగా ప్రవాసులను దేశం నుంచి వెళ్లగొట్టింది. ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు సుమారు 662 మంది వలసదారులను దేశం నుండి బహిష్కరించినట్లు సమాచారం. వీరందరూ వివిధ ఉల్లంఘనలకు పాల్పడినట్లు అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరిలో 447 మంది పురుషులు, 215 మంది మహిళలు ఉన్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే భారత్, ఈజిప్ట్, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల నుంచి దాదాపు 3.3 మిలియన్ల(33 లక్షలు) మంది కువైత్ లో ఉద్యోగాలు చేసేవారు. కువైత్ లో ఉద్యోగాలు చేసే విదేశీయులలో వీరు దాదాపు 70 శాతం..
భారత ప్రయాణికులకు గల్ఫ్ దేశం ఒమన్ భారీ ఊరటనిచ్చింది. కోవాక్సిన్ తీసుకున్నవారు సైతం ఒమన్ వెళ్లేందుకు మార్గం సుగమమైంది. తమ దేశంలో ఆమోదం పొందిన కరోనా వ్యాక్సిన్ల జాబితాలో కోవాక్సిన్‌ను కూడా చేర్చుతున్నట్లు తాజాగా ఒమన్ ప్రకటించింది. కనుక కోవాక్సిన్ తీసుకున్నవారు ఎలాంటి సందేహం లేకుండా సుల్తానేట్ కు వెళ్లొచ్చు. అంతేగాక కోవాక్సిన్ వేసుకున్న భారతీయులకు క్వారంటైన్ నుంచి కూడా మినహాయింపు ఇచ్చింది ఒమన్ సర్కార్. ఈ మేరకు తాజాగా ఒమన్ లోని భారత ఎంబసీ కీలక ప్రకటన విడుదల చేసింది. జర్నీకి 14 రోజుల ముందు రెండో డోసు తీసుకున్నవారికి కూడా ఒమన్‌లో ప్రవేశానికి అనుమతి ఉంటుందని ఈ సందర్భంగా రాయబార కార్యాలయం వెల్లడించింది. అయితే, ఇతర కరోనా నిబంధనలు ముఖ్యంగా ప్రయాణానికి ముందు ఆర్ టీ-పీసీఆర్ టెస్టు వంటివి తప్పనిసరి అని ఎంబసీ పేర్కొంది.