Begin typing your search above and press return to search.
కుప్పంలో జూ.ఎన్టీఆర్ టెన్షన్.. టీడీపీలో సెగలు?
By: Tupaki Desk | 18 Jun 2021 12:30 PM GMTటీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ రావాలన్నది టీడీపీ శ్రేణుల ప్రధాన డిమాండ్. కుప్పంలో ఇప్పటికే చంద్రబాబును నిలదీశారు కూడా. ఇక ఫ్లెక్సీలు బోలెడు వెలుస్తున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటికీ రాజకీయాలపై తాను ఇప్పటికీ ఏ నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నాడు. అయినా కూడా టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ రచ్చ ఆగడం లేదు.
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో జూనియర్ జపం ఎందుకు మొదలైంది? చంద్రబాబు ఎందుకు అలెర్ట్ అవుతున్నాడన్న దానిపై స్పెషల్ ఫోకస్.
చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నామ జపం టీడీపీ అధినేత గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు ముందే ఎన్టీఆర్ రావాలని నినాదాలు చేయడంతో బాబు ఇరుకునపడ్డారు. ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ జెండాను 40 అడుగుల ఎత్తున ఎగురవేశారు. ఏదో జాతరగా ఫ్లెక్సీలు ఊదరగొట్టారు.
కేవలం కుప్పంలోనే ఈ విధంగా ఉంటే.. అది కాస్తా చంద్రబాబు సీరియస్ కు కారణమైందట.. కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గోల ఏంటని ఆయన ఆరాతీయడం మొదలుపెట్టాడట.. పార్టీ నేతలకు తెలియకుండా ఇదంతా ఎవరు చేస్తున్నారని చంద్రబాబు మండిపడినట్టుగా చెబుతున్నారు.
నిజంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే ఇదంతా చేస్తున్నారా? లేక రాజకీయ ప్రత్యర్థులు ఏమైనా కుట్ర చేస్తున్నారా? సొంత పార్టీ మనుసులే ఇలాంటి పనులను ప్రోత్సహిస్తున్నారా? అనే పలు రకాల అనుమానాలను చంద్రబాబు వెంటాడుతున్నట్టు సమాచారం.