Begin typing your search above and press return to search.
రికార్డు సృష్టించిన హైదరాబాద్ మెట్రో
By: Tupaki Desk | 31 Dec 2021 12:30 AM GMTకరోనా కల్లోలంలో లాక్ డౌన్ పడి మెట్రో సహా ప్రజా రవాణా నిలిచిపోయింది. దీంతో భారీ నష్టాలను సంస్థలు చవిచూడాల్సి వచ్చింది. ఆర్టీసీ, మెట్రో, రైల్వేలు ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాయి. వీటినుంచి గట్టేక్కేందుకు ప్రస్తుతం నిధుల వేటలో పడ్డాయి.
ఈ క్రమంలోనే హైదరాబాద్ మెట్రో కూడా భారీగా నిధుల సమీకరణలో పడింది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్, కమర్షియల్ పేపర్ల ద్వారా రూ.13119 కోట్లు సమీకరించింది. ఒక్కరోజులో ఇంత భారీ మొత్తంలో నిధులు సమీకరించడంలో ఇదో రికార్డుగా చెప్పొచ్చు.
నిధుల సమీకరణలో భాగంగా 2021 డిసెంబర్ 29 బుధవారం మూడు రకాలైన బాండ్ పేపర్ల ను ఎల్ అండ్ టీ సంస్థ జారీ చేసింది.వీటిలో ఒక్కో బాండ్ ద్వారా రూ.2872 కోట్లు సమీకరించింది. ఇలా బాండ్ పేపర్ల ద్వారా 8616 కోట్లు సమీకరించింది. ఈ బాండ్ పేపర్లకు సంబంధించి వడ్డీ రేంజ్ ను 6.38 శాతం నుంచి 6.68 వరకూ ఉంది.
ఇక బాంబ్ పేపర్ల మెచ్చురిటీ విషయానికి వస్తే.. మూడేళ్ల నాలుగు నెలలు.. నాలుగేళ్ల నాలుగు నెలలు.. ఐదేళ్ల నాలుగు నెలలుగా ఉంది. మిగిలిన సొమ్మును కమర్షియల్ పేపర్ల ద్వారా సమీకరించింది. ఎస్బీఐ క్యాపిటల్ నిధుల సమీకరణలో భాగస్వామిగా వ్యవహరించింది. మిగిలిన నిధులు కమర్షియల్ పేపర్ల ద్వారా సమీకరించింది.
కరోనా సంక్షోభం కారణంగా నష్టాలు పెరగడంతో ప్రభుత్వాలను సాఫ్ట్ లోన్ రూపంలో అందించాలని ఎల్ అండ్ టీ కోరింది. కానీ నిధుల సమీకరణ పెండింగ్ లో ఉండగానే మార్కెట్ ద్వారా ఈ నిధుల సమీకరణలో పడింది.