Begin typing your search above and press return to search.

కరోనా అప్డేట్ : తెలంగాణలో ఒక్కరోజే 3,018 కరోనా కేసులు

By:  Tupaki Desk   |   26 Aug 2020 5:45 AM GMT
కరోనా అప్డేట్ : తెలంగాణలో ఒక్కరోజే  3,018 కరోనా కేసులు
X
తెలంగాణ లో మళ్లీ కరోనా జోరు మొదలైనట్టు కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా తక్కువగా నమోదు అవుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి భారీగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3,018 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, అదే సమయంలో మరో పది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీనితో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,688 కి చేరింది. ఆసుపత్రుల్లో 25,685 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 85,223 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 780కి చేరింది.

జీహెచ్ ‌ఎంసీ పరిధిలో కొత్తగా 475 కరోనా కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ మొదటికి వచ్చాయి. కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టినట్టు కనిపించినప్పటికీ.. 24 గంటల్లో కొత్తగా 475 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజే 3 వేల కంటే ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం తెలంగాణలో ఇదే తొలిసారి. గ్రేటర్ హైదరాబాద్ సహా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌ గిరి, మంచిర్యాల, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అర్బన్, నల్లగొండ జిల్లాల్లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ఆయా జిల్లాల్లో అత్యదిక కేసులు నమోదు అయ్యాయి.

జిల్లాలవారీగా కరోనా కేసుల వివరాలు చూస్తే .... 24 గంటల్లో కొత్తగా ఆదిలాబాద్-28, భద్రాద్రి కొత్తగూడెం-95, జగిత్యాల-100, జనగామ-52, జయశంకర్ భూపాలపల్లి-20, జోగుళాంబ గద్వాల-37, కామారెడ్డి-76, కరీంనగర్-127, ఖమ్మం-161, కొమరంభీమ్ ఆసిఫాబాద్-11, మహబూబ్ నగర్-56, మహబూబాబాద్-60, మంచిర్యాల-103, మెదక్-40, మేడ్చల్ మల్కాజ్‌ గిరి-204, ములుగు-26, నాగర్ కర్నూలు-38, నల్లగొండ-190, నారాయణపేట్-14, నిర్మల్-41, నిజామాబాద్-136, పెద్దపల్లి-85, రాజన్న సిరిసిల్ల-69, రంగారెడ్డి-247, సంగారెడ్డి-61, సిద్ధిపేట్-88, సూర్యాపేట్-67, వికారాబాాద్-21, వనపర్తి-46, వరంగల్ రూరల్-61, వరంగల్ అర్బన్-139, యాదాద్రి భువనగిరి-44 కేసులు నమోదు అయ్యాయి. ఇకపోతే , రాష్ట్రంలో ఒకవైపు కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ ఒకటి నుండి కేంద్రం మొత్తం ఆన్ లాక్ ప్రకటించడం తో రాష్ట్ర ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తుంది.