Begin typing your search above and press return to search.
కరువులోనూ జీఎస్టీ వసూళ్లలో రికార్డు
By: Tupaki Desk | 6 Jun 2021 4:30 AM GMTఇంత కరోనా కల్లోలంలోనూ కేంద్రం గల్లాపెట్టె మాత్రం నిండుతూనే ఉండడం విశేషం. దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో తాజాగా రికార్డ్ నమోదైంది. ఇంత కరువులోనూ కేంద్రానికి దండిగా ఆదాయం సమకూరింది. రికార్డు స్థాయిలో మే నెలలో గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) ద్వారా కేంద్రానికి లక్ష రెండు వేల కోట్ల ఆదాయం సమకూరడం విశేషం.
కరోనా సంక్షోభంతో మూడు నెలలుగా లాక్ డౌన్ దేశంలో ఉంటున్నా కేంద్రం ఆదాయానికి నష్టం మాత్రం చేకూరలేదు. జీఎస్టీ పన్ను వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థికశాఖ శనివారం వెల్లడించింది. గత ఏడాది మేలో వచ్చిన జీఎస్టీ ఆదాయంతో పోల్చితే ఇది 65 శాతం అధికం. గత ఎనిమిది నెలలుగా జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటుతున్నాయి. ఫస్ట్ వేవ్ ముగిసిన తర్వాత పన్ను వసూళ్లు క్రమంగా పెరిగాయి. అక్టోబర్ నుంచి మే వరకు ఎనిమిది నెలల పాటు ప్రతీనెల లక్ష కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.
లాక్ డౌన్ ప్రభావం ఉన్నా కూడా దీని ప్రభావం వసూళ్లపై స్పష్టంగా కనిపించింది. ఏప్రిల్ లో జీఎస్టీ ద్వారా 1.41 లక్షల కోట్ల ఆదాయం రాగా మే నెలలో దాదాపు 41వేల కోట్ల ఆదాయం తగ్గిపోయి రూ.1.02 లక్షల కోట్ల ఆదాయమే వచ్చింది.
2020 మేతో పోల్చితే ఆర్థిక వ్యవస్థపై కరోనా, లాక్ డౌన్ ప్రభావం తగ్గింది. కేంద్రం విడుదల చేసిన గణాంకాలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.