Begin typing your search above and press return to search.

15 ఏళ్లలో అత్యధిక పౌరసత్వాలు జారీ.. అమెరికాలో ఇదో రికార్డ్

By:  Tupaki Desk   |   5 Jan 2023 5:35 AM GMT
15 ఏళ్లలో అత్యధిక పౌరసత్వాలు జారీ.. అమెరికాలో ఇదో రికార్డ్
X
అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగం చేయాలని.. ఉపాధి లభించాలని అందరూ ఆ కలల ఫ్లైట్ ఎక్కేస్తారు. అక్కడ డాలర్లు సంపాదించి బాగా బతకాలని కలలుగంటారు. కానీ కొందరే ఇందులో సక్సెస్ అవుతారు.సక్సెస్ అయిన వారు తిరిగి చూడకుండా బతుకుతారు. అమెరికా కూడా తమ దేశానికి ప్రయోజనం చేకూర్చే ఎంతో మందిని స్వాగతిస్తోంది. తమలో కలుపుకుంటోంది. అందుకే అత్యధిక పౌరసత్వాలు జారీ చేస్తోంది.

2022లో అత్యధికంగా 1 మిలియన్ వలసదారులు అమెరికాలో ఆ దేశ పౌరులుగా మారారు. ఇది దాదాపు 15 సంవత్సరాలలో అత్యధిక సంఖ్య కావడం విశేషం. కోవిడ్-19 కారణంగా పెరిగిన బ్యాక్‌లాగ్ ఎట్టకేలకు క్లియర్ చేయబడింది. ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న చాలా మందికి నూతన సంవత్సర కానుకగా దేశ పౌరసత్వాన్ని అమెరికా అందించింది.

యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ప్రకారం భారతదేశం, క్యూబా, ఫిలిప్పీన్స్, మెక్సికో మరియు డొమినిక్ రిపబ్లిక్ నుండి ఎక్కువ మంది కొత్త పౌరులు అమెరికాకు వచ్చారు. కరోనా మహమ్మారి కారణంగా పౌరసత్వ ఇంటర్వ్యూలు , వేడుకలు నిలిపివేయబడ్డాయి. ప్యూ రీసెర్చ్ సెంటర్ కారణంగా జూన్ 2022 చివరి నాటికి దరఖాస్తుల బ్యాక్‌లాగ్ 6,73,000కి చేరుకుంది.

ఇమ్మిగ్రేషన్ సిబ్బంది కూడా మహమ్మారి కారణంగా సమస్యలను ఎదుర్కొంది. ఎందుకంటే ముఖాముఖి ఇంటర్వ్యూలు కావడంతో ఈ ప్రక్రియను నిలిపివేశారు. దరఖాస్తులన్నీ పెండింగ్ లో పడిపోయాయి. రుసుములు చెల్లించి మరీ చాలా మంది నిరీక్షించారు. అలాగే, మే 2020 మరియు ఏప్రిల్ 2021 మధ్య నియామక స్తంభన చోటుచేసుకుంది. ఇది పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను మరింత పెంచింది.

ఇప్పుడు, ఇమ్మిగ్రేషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్‌ లు కలిసి పౌరసత్వం దరఖాస్తులు క్లియర్ చేసింది. మహమ్మారికి ముందు మాదిరిగానే 2022లో ఉపాధి ఆధారిత వలస వీసాల సంఖ్య కంటే రెండింతలు జారీ చేసింది.

అయినప్పటికీ, టైటిల్ 42 , మెక్సికోలో రిమైన్ వంటి చట్టాలు మెక్సికో నుంచి వచ్చిన అనేక మంది వలసదారులకు పౌరసత్వం అమెరికాలో దక్కడం లేదు. ఇంకా ఆ సమస్య వెంటాడుతూనే ఉంది. అమెరికా న్యాయస్థానాలు ఈ సమస్యపై విచారణ జరుపుతున్నాయి. చట్టాలను సరళీకరించడానికి తమ వంతు కృషి చేస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.