Begin typing your search above and press return to search.
వరంగల్ ఖిల్లాపై దయాకర్ రికార్డుల జెండా
By: Tupaki Desk | 24 Nov 2015 8:10 AM GMT వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పసుపునూరి దయాకరరావు భారీ మెజార్టీతో దూసుకెళ్తున్నారు. ఆయన సాధిస్తున్న మెజారిటీ ఆ స్తానంలో రికార్డు నమోదు చేయబోతోంది.
వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో రెండు ఉపఎన్నికలున్నాయి. 1952 నుంచి 2015 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 9సార్లు.. టీడీపీ ఐదు సార్లు.. టీఆర్ ఎస్ రెండుసార్లు గెలుపొందాయి. పీడీఎఫ్ ఒకసారి.. టీపీఎస్ ఒకసారి విజయం సాధించాయి.
- 2014 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి 3 లక్షల 92 వేల 574 ఓట్ల మెజారిటీతో విజయం సాదించారు.
- 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాండిడేట్ సిరిసిల్ల రాజయ్య లక్షా 24 వేల 661 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
- 2008 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు 4 వేల 386 ఓట్ల తేడాతో ఎంపీగా గెలిచారు.
- 2004 లో టీఆర్ ఎస్ తరఫున ధరావత్ రవీంద్రనాయక్ 19 వేల 262 ఓట్ల మెజారిటీతో విన్నయ్యారు.
- 1999 లో టీడీపీ క్యాండిడేట్ బి.వెంకటేశ్వర్లు 13 వేల 336 ఓట్ల తేడాతో గెలుపొందారు.
- 1998 లో టీడీపీ తరఫున అజ్మీరా చందూలాల్ 24 వేల 801 ఓట్ల ఆధిక్యం సంపాదించి ఎంపీ అయ్యారు.
- 1996 లోనూ చందూలాల్ టీడీపీ క్యాండిడేట్ గా పోటీచేసి17 వేల 440 ఓట్ల మెజారిటీతో తొలిసారి పార్లమెంట్ లో అడుగుపెట్టారు.
- 1991 లో కాంగ్రెస్ అభ్యర్థి సురేంద్ర రెడ్డి రామ సహాయం 51 వేల 873 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
- 1989లోనూ సురేంద్రరెడ్డి రామ సహాయం 54 వేల 121 ఓట్ల ఆధిక్యంతో ఎంపీ అయ్యారు.
- 1984 లో టీడీపీ అభ్యర్థి టి.కల్పనాదేవి 8వేల 456 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
- 1980లో కాంగ్రెస్ ఐ పార్టీ నుంచి పోటీచేసిన కమాలుద్దీన్ అహ్మద్ 1 లక్షా 22 వేల 42 ఓట్ల తేడాతో భారీ విజయం సాధించారు.
- 1978 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీఎం రావ్ 12 వేల 258 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
- 1977 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎస్.బి.గిరి లక్షా 22 వేల 622 ఓట్ల తేడాతో గెలిచి ఎంపీ అయ్యారు.
- 1971 లో తెలంగాణ ప్రజా సమితి పార్టీ నుంచి 93 వేల 640 ఓట్ల తేడాతో విజయం సాధించారు ఎస్.బి.గిరి.
- 1967 లో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్.ఎస్.రెడ్డి 69 వేల 945 ఓట్ల మెజారిటీతో విజేతగా నిలిచారు.
- 1962 లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బి. అలీ మీర్జా… కేవలం 736 ఓట్ల తేడాతో సమీప సీపీఐ అభ్యర్థిపై విజయం సాధించారు.
- 1957లో కాంగ్రెస్ క్యాండిడేట్.. ఎస్.అలీ ఖాన్ 14 వేల 955 ఓట్ల మెజారిటీతో విక్టరీ కొట్టారు.
- వరంగల్ ఎంపీ సెగ్మెంట్ కు తొలిసారి 1952 లో జరిగిన ఎన్నికల్లో పీడీఎఫ్ నేత పెండ్యాల రాఘవరావు కాంగ్రెస్ అభ్యర్థి కాళోజీ నారాయణరావుపై 4 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
- కాగా వరంగల్ లోక్ సభ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక ఓట్ల తేడాతో విజయం సాధించిన రికార్డును కడియం శ్రీహరి దక్కించుకున్నారు. ఇప్పుడు దయాకర్ దాన్ని తిరగరాసేందుకు సిద్ధమవుతున్నారు.
- ఇప్పటివరకు 16వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేసరికి దయాకర్ ఆధిక్యత నాలుగు లక్షలు దాటింది. ఇంకా మరో ఆరు రౌండ్లు మిగిలి ఉన్నాయి. దీంతో మెజారిటీ ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది.